కోదాడ టౌన్, ఏప్రిల్ 23 : పండ్ల వ్యాపారస్తులు అందరూ ఐక్యంగా ఉంటూ పరస్పర సహకారంతో సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆ సంఘం కోదాడ అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ షేక్ షమ్మీ అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో సంఘం గౌరవ అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ షేక్ బషీర్‌తో కలిసి సంఘ సంక్షేమ నిధి నుండి సభ్యులకు వడ్డీ లేని రుణాలను అందజేసి మాట్లాడారు.
పండ్ల వ్యాపారస్తులు అధిక వడ్డీలకు అప్పులు తీసుకుని ఆర్థికంగా నష్టపోకుండా సంఘం అందించే రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రుణాలను సకాలంలో చెల్లించి మరింత మందికి అవకాశం కల్పించే విధంగా సంఘ సభ్యులు అందరూ సహకరించి, సంఘ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ ఇస్మాయిల్, కోశాధికారి సుభాని, జానీ, జిలాని, సలీమా, శేషు,నరసింహారావు, కరుణ పాల్గొన్నారు.