Hoardings | కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 23 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో దూలపల్లి-కొంపల్లి ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ప్రకటనల హోర్డింగ్ బోర్డులను ఇవాళ హైడ్రా అధికారులు కూల్చివేశారు.
గత కొంతకాలంగా ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా కొంతమంది నిర్వాహకులు మధ్యవర్తులతో కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు చేస్తూ వ్యాపారంగా మలచుకున్నారని తమకు ఫిర్యాదులు అందాయని హైడ్రా అధికారులు తెలిపారు. అలాంటి అనుమతులు లేకుండా కొనసాగిస్తున్న ప్రకటన హోర్డింగ్ బోర్డులను కూల్చి వేశామన్నారు.
ఫిర్యాదుల మేరకు కొంపల్లిలో రెండు హోర్డింగులు, దూలపల్లిలో మరో రెండు హోర్డింగులు కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు.
Errabelli Dayakar Rao | ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్లో భారీగా చేరికలు
KTR | పెంబర్తి వద్ద కేటీఆర్కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి