Kesari Chapter 2 | బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘కేసరి చాప్టర్ 2’ (Kesari Chapter2). అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్ వాలాబాగ్ అనేది ట్యాగ్‌లైన్. మాధవన్, రెజీనా కసాండ్రా, అనన్య పాండే కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు కరణ్ సింగ్ త్యాగీ దర్శకత్వం వహించగా.. ధర్మ ప్రోడక్షన్ బ్యానర్‌పై కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మించాడు. సమ్మర్ కానుకగా ఈ చిత్రం ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకు హిట్టు టాక్ వచ్చిన కూడా కలెక్షన్స్ మాత్రం దారుణంగా ఉన్నాయి.
ఈ చిత్రం 5 రోజుల్లో రూ.39.16 కోట్ల నెట్ కలెక్షన్స్(Movie Collection) మాత్రమే సాధించింది. ఈ విషయాన్ని సదరు నిర్మాణ సంస్థనే అధికారికంగా ప్రకటించింది. మూవీకి పాజిటివ్ టాక్ వచ్చి 5 రోజుల్లో రూ.100 కోట్లు సాధించాల్సిందిపోయి.. కేవలం రూ.40 కోట్లు కూడా దాటకపోవడంతో రూ.100 కోట్ల మార్క్ అందుకోవడానికి ఇంకెన్ని రోజులు పడుతుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు యాక్షన్ సన్నివేశాలు కూడా లేకపోవడంతో ఓటీటీలోకి వచ్చాక ఈ సైలెంట్ డ్రామాను చూద్దామని ప్రేక్షకుల ఎదురుచూస్తున్నారు.