Intel | ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగాల కోత కొనసాగుతున్నది. ఆర్థిక అస్థిరతతో గ్లోబల్ మార్కెట్లలో ఒత్తిడి, టారిఫ్ వార్, అమెరికాలో మాంద్యం భయాలు, లాభాల క్షీణత, ఏఐ వినియోగం పెరగడం.. వెరసి కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగులను (Employees) తొలగిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 100 కంపెనీలు 27 వేల మందికిపైగా ఉద్యోగులపై వేటు వేశాయి. తాజాగా చిప్ తయారీ కంపెనీ ఇంటెల్సైతం ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైనట్లు తెలిసింది.
గత మార్చిలో ఇంటెల్ కొత్త సీఈఓగా లిప్-బు టాన్ (Lip-Bu Tan) బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఆయన ఆధ్వర్యంలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపడుతున్న ఇంటెల్, తన ఉద్యోగుల్లో 20 శాతానికి పైగా తొలగించాలని యోచిస్తోంది. ఈ వారంలోనే లేఆఫ్స్‌పై ప్రకటన చేయనున్నట్లు తెలిసింది. సంస్థలోని అంతర్గత ఉద్యోగులను ఊటంకిస్తూ బ్లూమ్‌బర్గ్ నివేదించింది. ఎంతమంది ఉద్యోగులపై ఈ ప్రభావం పడనుందన్నది తెలియరాలేదు. తాజా నివేదికతో సంస్థలోని ఉద్యోగుల్లో లేఆఫ్స్ గుబులు పట్టుకుంది. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని భయంతో వణికిపోతున్నారు.
Also Read..
Gold price | బంగారం ధరలకు బ్రేక్.. రూ.లక్ష దిగువకు పడిపోయిన పుత్తడి
Cement | సిమెంట్ ధరలకు రెక్కలు? ఈ ఆర్థిక ఏడాదిలో 4 % పెరగనున్న రేట్లు