Gold price | గత కొంత కాలంగా ఆకాశమే హద్దుగా పరుగులు పెట్టిన బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి కారణంగా దేశీయ మార్కెట్లో ఆల్టైమ్ గరిష్ఠానికి తాకిన బంగారం ధర (Gold price) బుధవారం భారీగా దిగొచ్చింది.
10 గ్రాముల పుత్తడి ధర దాదాపు రూ.3వేలు తగ్గింది. తాజా తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.98,500కు పడిపోయింది. అదే 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.90,300గా ఉంది. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.98,350గా, 22 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన పుత్తడి ధర రూ.90,150గా ఉంది.
కాగా, మంగళవారం నాడు బంగారం ధరలు తొలిసారిగా లక్ష రూపాయల మైలురాయిని అధిగమించి రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. ఢిల్లీ (Delhi), ముంబై, కోల్కతా, చెన్నై సహా అన్ని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన ఒక గ్రాము బంగారం ధర రూ.10,000 పైనే పలికింది. అత్యధికంగా దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల బంగారం ధర రూ.1,02,160కు చేరింది. ఇవాళ కాస్త దిగొచ్చింది.
Also Read..
Cement | సిమెంట్ ధరలకు రెక్కలు? ఈ ఆర్థిక ఏడాదిలో 4 % పెరగనున్న రేట్లు
పుత్తడి పరుగో పరుగు మరో 1,800 పెరిగిన తులం