French Open : ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ఫేవరెట్లలో ఒకడైన నొవాక్ జకోవిచ్(Novak Djokovic) పోరాటం సెమీ ఫైనల్లోనే ముగిసింది. మట్టికోర్టులో మరో ట్రోఫీ గెలవాలనుకున్న అతడి కలను కల్లలు చేశాడు జన్నిక్ సిన్నర్ (Jannik Sinner). కెరియర్లో అత్యధిక గ్రాండ్‌స్లామ్స్‌తో చరిత్ర సృష్టించిన జకోకు ఇటలీ కెరటం చెక్ పెట్టాడు. శనివారం ఉత్కంఠగా సాగిన పోరులో సెర్బియా వీరుడికి చుక్కలు చూపిస్తూ ఫైనల్‌కు దూసుకెళ్లాడీ వరల్డ్ నంబర్ 1. తద్వారా ఓపెన్ ఎరాలో ఈ మెగా టోర్నీ తుది పోరుకు అర్హత సాధించిన రెండో ఇటాలియన్గా సిన్నర్ రికార్డు నెలకొల్పాడు.
మాజీ వరల్డ్ నంబర్ 1 జకోవిచ్ మరో గ్రాండ్‌స్లామ్ ఆశలపై సిన్నర్ నీళ్లు చల్లాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో టైటిల్ దిశగా సాగుతున్న అతడిని సెమీస్‌లో ఇంటికి పంపాడీ యంగ్‌స్టర్. ‘నువ్వానేనా’ అన్నట్టు సాగిన పోరులో ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా జకోపై పైచేయి సాధించాడీ ఇటలీ సెన్సేషన్. తొలి సెట్ కోల్పోయినప్పటికీ కంగారు పడకుండా.. తన మార్క్ ఆటతో విరుచుకుపడ్డాడు సిన్నర్. బలమైన ఏస్‌లు, పదునైన సర్వ్‌లతో చెలరేగి వరుసగా రెండు సెట్లను 7-5, 7-5 తో గెలుపొందిన అతడు మ్యాచ్ విజేతగా నిలిచాడు.
Jannik Sinner is into the French Open Final without dropping a set pic.twitter.com/h968F9xiUN
— Barstool Tennis (@StoolTennis) June 6, 2025
‘జకో అత్యుత్తమైన ఆటగాడు. అతడిని ఓడించాలంటే సర్వ శక్తులు ఒడ్డాల్సిందే. అందుకే సెమీస్‌లో నేను నా బెస్ట్ గేమ్ ఆడాను. మానసికంగా బలంగా ఉండడంతో పాటు ప్రతి పాయింట్ గెలవాలనే ఉద్దేశంతో ఆడాను. అంతేకాదు జకోకు కౌంటర్ అటాక్ ఇవ్వడం చాలా ముఖ్యం. అది సాధ్యమవ్వాలంటే శ్రద్ధగా ఉండాలి. సో.. సెమీస్‌లో నేను అదే చేశాను’ అని మ్యాచ్ అనంతరం సిన్నర్ తెలిపాడు. టైటిల్ పోరులో అతడు డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz )ను ఢీకొట్టనున్నాడు.