Encounter | ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) అడవుల్లో గత కొన్ని రోజులుగా తుపాకుల మోత మోగుతోంది. ఆపరేషన్ కగార్‌లో భాగంగా యాంటీ నక్సల్ ఆపరేషన్ చేపట్టిన భద్రతా దళాలు.. కంటికి కనిపించిన మావోయిస్టులను కాల్చుకుంటూ పోతున్నాయి. ఇప్పటికే పలువురు అగ్రనేతలు ఎదురు కాల్పుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం కూడా ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్ (Encounter) చోటు చేసుకుంది.
బీజాపూర్ (Bijapur) జిల్లాలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో (Bijapur National Park area) శనివారం జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. ఘటనాస్థలిలో రెండు ఏకే 47 రైఫిళ్లు, భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాలుగు రోజులుగా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మరణించారు.
బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు జిల్లా రిజర్వ్ గార్డ్స్(డీఆర్జీ), స్పెషల్ టాస్క్‌ఫోర్స్(ఎస్టీఎఫ్) భద్రతా దళాలు గత నాలుగు రోజులుగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురు, శుక్రవారాల్లో జరిగిన ఎన్కౌంటర్లో సుధాకర్, భాస్కర్ మరణించారు. భాస్కర్‌పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షలు, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డు ప్రకటించగా, సుధాకర్‌ఫై రూ.40 లక్ష రివార్డు ఉన్నది.
Also Read..
Mukesh Ambani | ముకేశ్ అంబానీ మంచి మనసు.. ముంబై ఐసీటీకి గురుదక్షిణగా రూ.151 కోట్ల విరాళం
Hospital Staff | అమానుషం.. ఐసీయూలోని రోగికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం
Virat Kohli | బెంగళూరు తొక్కిసలాట.. విరాట్ కోహ్లీపై పోలీసులకు ఫిర్యాదు