Mukesh Ambani | రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ముకేశ్ అంబానీ (Mukesh Ambani) తన మంచి మనసు చాటుకున్నారు. తాను చదువుకున్న ముంబైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి (ICT) గురుదక్షిణగా (Guru Dakshina) భారీ విరాళాన్ని అందించారు. ఐసీటీకి రూ.151 కోట్లు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ మొత్తాన్ని సంస్థ అభివృద్ధికి ఏ విధంగానైనా ఉపయోగించుకోవచ్చని వెల్లడించారు.
విఖ్యాత రసాయన శాస్త్రవేత్త, ప్రొఫెసర్ ఎంఎం శర్మ (MM Sharma) జీవిత చరిత్ర ఆధారంగా రూపుదిద్దుకున్న ‘డివైన్ సైంటిస్ట్’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా ముఖేశ్ అంబానీ ఈ కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ విరాళం తన గురువు ప్రొఫెసర్ శర్మకు ఇచ్చే గురుదక్షిణ అని పేర్కొన్నారు. తాను చదువుకున్న రోజులను, ప్రొఫెసర్ శర్మతో ఉన్న అనుబంధాన్ని ముకేశ్ అంబానీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. 1970లో ఐసీటీ నుంచి ముకేశ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. గతంలో దీన్ని యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీగా (UDCT) వ్యవహరించేవారు. 2008లో దీనికి ఐసీటీగా పేరు మార్చారు.
Also Read..
Hospital Staff | అమానుషం.. ఐసీయూలోని రోగికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం
Virat Kohli | బెంగళూరు తొక్కిసలాట.. విరాట్ కోహ్లీపై పోలీసులకు ఫిర్యాదు