Indonasia Open : ఒలింపిక్ విజేత పీవీ సింధు (PV Sindhu)కు మరోసారి నిరాశే మిగలింది. ఈ సీజన్లో ఒక్క టైటిల్ అయినా గెలవాలనే కసితో ఉన్న ఆమె మరోసారి రెండో రౌండ్ దాటలేకపోయింది. ఈమధ్యే మలేషియా మాస్టర్స్‌లో తొలి రౌండ్లోనే వెనుదిరిగిన భారత షట్లర్.. ఇండోనేషియా ఓపెన్ (Indonasia Open)లోనూ ఉసూరుమనిపించింది. గెలవాల్సిన మ్యాచ్‌లో పట్టుకోల్పోయి రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టింది.
తొలి రౌండ్లో చిరకాల ప్రత్యర్థి నొజొమి ఒకుహరకు చెక్ పెట్టిన సింధు.. రెండో రౌండ్లో అదే దూకుడును కనబరచలేకపోయింది. గురువారం ఉత్కంఠగా సాగిన పోరులో వరల్డ్ నంబర్ 8 పొర్నొపవీ చౌచువాంగ్ (థాయ్‌లాండ్) చేతిలో సింధు కంగుతిన్నది. తొలి సెట్‌ను గెలుచుకున్న తర్వాత ప్రత్యర్థికి అవకాశం ఇచ్చి వెనకబడింది. 78 నిమిషాల పాటు సాగిన పోరులో 22-20, 1021, 18-21తో సింధు పరాజయం మూటగట్టుకుంది.
Fought hard. These are the ones that sting. Long 3 setter that I should have won. But the work’s been solid, and I’m feeling so much better.
Terima kasih, Indonesia. Istora Senayan and the Indonesian crowd stunning as usual ❤️ pic.twitter.com/fig0n9RgcI
— Pvsindhu (@Pvsindhu1) June 5, 2025
‘నేను ఈ మ్యాచ్ కచ్చితంగా గెలవాలనుకున్నా. మూడో సెట్లో 16-13తో ఆధిక్యంలో ఉన్నా. కానీ, ఆ తర్వాత నియంత్రణ కోల్పోయాను. అక్కడి నుంచి పొర్నపవీ దూకుడుగా ఆడి ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే.. 18 ఆల్ చేసి పోటీలోకి వచ్చాను. ఆ సమయంలో మ్యాచ్ ఎవరైనా గెలిచే అవకాశముంది. మొత్తంగా నా ప్రదర్శన పట్ల సంతోషంగానే ఉన్నాను. ఈరోజు విజయం సాధించి ఉంటే బాగుండేది. ఈ ఓటమితో చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇక త్వరలో జరుగబోయే టోర్నమెంట్‌పై దృష్టి సారిస్తాను’ అని మ్యాచ్ అనంతరం సింధు తెలిపింది.