Vishal | తమిళ నటుడు విశాల్ ఈ మధ్య తన ఆరోగ్య సమస్యలతో వార్తలలో నిలవడం మనం చూశాం. ఆ తర్వాత విశాల్ .. హీరోయిన్ సాయి ధన్సికని వివాహం చేసుకోబోతున్నారు అనే విషయంతో హాట్ టాపిక్ అయ్యారు. ఇన్నాళ్లు ఒంటరిగా ఉన్న విశాల్ ఎవరిని పెళ్లి చేసుకుంటాడా అని అందరిలో ఆసక్తి ఉండేది. దానికి క్లారిటీ అయితే వచ్చింది. అనేక మంది హీరోయిన్లతో డేటింగ్ రూమర్ల అనంతరం కోలీవుడ్ హీరోయిన్ సాయి ధన్సికని విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇటీవల ‘యోగి ద’ సినిమా ఈవెంట్లో తమ ప్రేమని, పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆగస్ట్ 29న విశాల్ పుట్టిన రోజు కాగా, ఆ రోజు తాము పెళ్లి చేసుకోబోతున్నట్టు సాయి ధన్సిక ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచింది.
ఇక ఇదిలా ఉంటే విశాల్ పెద్ద సమస్యలలో చిక్కుకున్నాడు. 2022 లో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ విశాల్ పై చెన్నై హైకోర్టు లో పిటిషన్ వేసింది. సదరు పిటిషన్ లో విశాల్ తాను నటించిన ‘వీరమై వాగే చూడమ్’ మూవీ టైంలో 21 .29 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. డబ్బు తిరిగి ఇచ్చే వరకు ఆయన నిర్మించే సినిమా హక్కులని మాకు చెందే విధంగా ఒప్పందం కుదురుచ్చుకున్నారు. కానీ ‘వీరమై వాగే చూడమ్’ సినిమా హక్కులని విశాల్ వేరే వాళ్లకి ఇచ్చాడని లైకాప్రొడక్షన్స్ తన పిటిషన్ లో పేర్కొంది. అయితే అప్పటి నుండి ఈ కేసు విచారణ కొనసాగుతుండగా, తాజాగా చెన్నై హైకోర్టు దీనిపై తీర్పు ఇచ్చింది. తన తీర్పులో, విశాల్ 30 శాతం వడ్డీతో 21 .29 కోట్లు చెల్లించాలని వెల్లడి చేసింది. కాగా, ‘వీరమై వాగే చూడమ్’ కి విశాల్ నిర్మాతగాను వ్యవహరించాడు.
లైకా ఒప్పందాన్ని విశాల్ ఉల్లంఘించి సినిమాలు రిలీజ్ చేశాడని, డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ లైకా హైకోర్టులో కేసు వేసింది. రూ.15 కోట్లు డిపాజిట్ చెయ్యాలని విశాల్‌కి కోర్టు ఆర్డర్ వేసింది. డబ్బులు కట్టకపోతే కొత్త సినిమాలు రిలీజ్ చెయ్యకూడదంటూ బ్యాన్ కూడా వేసింది. అయితే విశాల్ డిపాజిట్ కూడా కట్టకుండా వచ్చాడు. కోర్టు ఆర్డర్‌ని పట్టించుకోకపోవడంతో, విశాల్‌ని జడ్జి పి.టి. ఆషా.. మందలించారు. దాంతో విశాల్ తన ఆస్తుల వివరాలు కోర్టుకు సమర్పించాడు. మూడు కార్లు, ఒక బైక్, రెండు బ్యాంక్ అకౌంట్స్, ఇంటి లోన్ డాక్యుమెంట్స్ ఇచ్చాడు. లైకా ప్రొడక్షన్స్, హీరో విశాల్ మధ్య జరిగిన ఆర్ధిక లావాదేవీల విషయంలలో ఈ వివాదం చోటు చేసుకుంది.