ISSF World Cup : భారత స్టార్ షూటర్లు విఫలమైన చోట అమ్మాయిలు పతకాల వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఎలవేనిల్ వలరివన్ (Elavenil Valarivan) కాంస్యం కొల్లగొట్టగా.. మరో షూటర్ సిఫ్ట్ కౌర్ సమ్రా (Sift Kaur Samra) దేశానికి పతకం అందించింది. గురువారం జరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్‌లో అదరగొడుతూ కాంస్యం గెలుపొందింది.
ఈమధ్యే ఆసియా క్రీడల్లో 453.1 పాయింట్లతో వరల్డ్ రికార్డు నెలకొల్పిన సిఫ్ట్ 8 మంది పోటీపడిన ఫైనల్లో సత్తా చాటింది. పసిడి పతకం వేటలో వెనకబడినా.. కంచు మోతతో దేశం గర్వపడేలా చేసింది. పంజాబ్‌లోని ఫరీద్‌కోటకు చెందిన సిఫ్ట్ ఈ ఏడాది ఆరంభంలో బ్యునోస్ ఐర్స్‌లో జరిగిన వరల్డ్ కప్‌లో పసిడి పతకం గెలుపొందింది. అయితే.. పారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం తీవ్రంగా నిరాశపరిచిన తను ఐఎస్ఎస్ వరల్డ్ కప్‌లో పతకమే లక్ష్యంగా పోటీపడింది.
Sift Kaur Samra brings home India’s🇮🇳 second medal at the #ISSF World Cup, Munich🇩🇪, bagging a Bronze🥉 in Women’s 50m Rifle 3P.
Well done, Sift!👏🏻#WorldCup #GameOn #Shooting #IndianShooting #WomenInSports pic.twitter.com/sFmOIDUuFi
— SAI Media (@Media_SAI) June 12, 2025
క్వాలిఫికేషన్ రౌండ్లో రెండో స్థానంలో నిలిచిన సిఫ్ట్ నీలింగ్, ప్రోన్, స్టాండిగ్.. ఈ మూడు పోటీల్లో 592 పాయింట్లు తెచ్చుకుని ఫైనల్‌కు అర్హత సాధించింది. కానీ, స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడంతో కాంస్యంతో సరిపెట్టుకుందీ యువ షూటర్. నార్వేకు చెందిన జీనెట్టె హెగ్ డ్యుస్టాడ్ స్వర్ణం ఎగరేసుకుపోయింది. రెండో స్థానంలో నిలిచిన ఎమిలే జేగ్గీ(స్విట్టర్లాండ్) రజతంతో మురిసింది.
జూన్ 10 మంగళవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పిస్టల్ ఫైనల్లో వలరివన్ కాంస్యంతో మెరిసింది. పసిడిపై గురి పెట్టిన తను చివరకు కంచుమోత మోగించింది. జర్మనీలోని మ్యూనిచ్ వేదికగా క్వాలిఫికేషన్ రౌండ్లో అదరగొట్టిన 25 ఏళ్ల ఈ యువకెరటం స్వర్ణ పతకమే లక్ష్యంగా బరిలోకి దిగింది. అయితే.. 231.2 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.
వలరివన్