WTC Final : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా (South Africa) బ్యాటర్లు పోరాడుతున్నారు. ఆస్ట్రేలియా పేసర్లను దీటుగా ఎదుర్కొంటూ ఆధిక్యాన్ని తగ్గిస్తూ వస్తున్నారు. కెప్టెన్ తెంబ బవుమా (36)తో కలసి యువకెరటం డేవిడ్ బడింగమ్ (39 నాటౌట్) కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఐదో వికెట్‌కు రన్స్ జోడించిన ఈ ద్వయాన్ని కమిన్స్ విడదీసి ఆసీస్‌కు బ్రేకిచ్చాడు. ఆ తర్వాత కైలీ వెర్రినే(11 నాటౌట్) జతగా బడింగమ్ మరో విలువైన భాగస్వామ్యం నెలకొల్పే పనిలో ఉన్నాడు. దాంతో, లంచ్ సమయానికి సఫారీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 121 రన్స్ చేసింది. ఇంకా 91 పరుగులు వెనకబడి ఉంది.
లార్డ్స్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలిరోజు ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయించినా.. రెండో రోజు మాత్రం దక్షిణాఫ్రికా బ్యాటర్లు పట్టుదలగా ఆడుతున్నారు. చివరి ఆరు వికెట్లు తీసి మ్యాచ్‌పై పట్టుబిగించాలనుకున్న ఆసీస్ ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. ఓవర్‌నైట్ స్కోర్‌తో ఇన్నింగ్స్ ఆరంభించిన సఫారీ జట్టును తెంబ బవుమా(36), డేవిడ్ బడింగమ్(39 నాటౌట్) గట్టెక్కించారు. తొలి సెషన్లో కంగారూ పేస్ దళాన్ని సమర్ధంగా ఎదుర్కొన్న ఈ జోడీ విలువైన భాగస్వామ్యంతో జట్టు స్కోర్ 100 దాటించింది.
Temba Bavuma and David Bedingham’s superb efforts help reel in Australia’s lead 👊#SAvAUS
Follow the #WTC25 Final LIVE ➡️ https://t.co/LgFXTd0RHt pic.twitter.com/WqXfdd82fA
— ICC (@ICC) June 12, 2025
అయితే.. కమిన్స్ బౌలింగ్‌లో షాట్ ఆడబోయిన బవుమా ఔటయ్యాడు. లబుషేన్ కళ్లు చెదిరే క్యాచ్ అందుకోవడంతో సఫారీ సారథి నిరాశగా పెవిలియన్ చేరాడు. దాంతో.. 94 వద్ద ఐదో వికెట్ పడింది. అయినా సరే బడింగమ్ ఏకాగ్రతతో ఆడుతూ స్కోర్ బోర్డును నడిపిస్తున్నాడు. అతడికి సహకరిస్తున్న కైలీ వెర్రినే(11 నాటౌట్) జట్టు స్కోర్ 120 దాటించాడు. దాంతో, లంచ్ సమయానికి బవుమా బృందం 5 వికెట్ల నష్టానికి 121 రన్స్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 212 పరుగులకు ఆలౌటయ్యింది. స్టీవ్ స్మిత్(66), వెబ్‌స్టర్(72) అర్ధ శతకాలతో ఆదుకోగా.. పేసర్లు మిచెల్ స్టార్క్(2-38), కమిన్స్(2-24) నిప్పులు చెరిగి సఫారీ టాపార్డర్‌ను కూల్చారు.
Proteas captain Temba Bavuma shows positive intent early on Day 2 💪
Catch the action live on our official broadcasters here ➡ https://t.co/oas2Rsdptj#SAvAUS #Cricket #CricketReels #WTC25 pic.twitter.com/NXPaTIAwe4
— ICC (@ICC) June 12, 2025