Plane Crash | అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. 242 మంది ప్రయాణికులతో లండన్‌కు బయలుదేరిన విమానం.. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకు కూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు వంద మందికిపైగా మృతి చెందినట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఎంత మంది మరణించారో అధికారులు నిర్ధారించలేదు. ప్రమాదం నేపథ్యంలో అహ్మదాబాద్ విమానాశ్రయాన్ని మూసివేశారు. ప్రస్తుతం అన్ని కార్యకలాపాలు నిలిపివేశారు. ఎయిర్ ఇండియా చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఎయిర్ ఇండియా ఫ్లయిట్ AI-171 ప్రమాదాన్ని ధ్రువీకరించారు. బాధితులు, కుటుంబాలకు అండగా నిలుస్తామన్నారు.
ప్రస్తుతం వారికి సహాయం చేయడంపైనే ప్రాథమికంగా దృష్టి సారించినట్లు తెలిపారు. విషాదకర ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన.. ఘటనతో ప్రభావితమైన వారందరి కుటుంబాలు, ప్రియమైన వారి గురించే తమ ఆలోచనలు ఉన్నాయని.. వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు. సంఘటనా స్థలంలో అత్యవసర ఎమర్జెన్సీ రెస్పాన్స్ బృందాలకు సహాయం చేసేందుకు..అవసరమైన మద్దతు అందించేందుకు తమ శక్తి మేరకు ప్రతిదీ చేస్తున్నామన్నారు. ప్రమాదం నేపథ్యంలో సమాచారం అందించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని.. అవసరమైన సమాచారం అందిస్తుందన్నారు. సమాచారం అందించిన వెంటనే మిగతా వివరాలు పంచుకుంటామన్నారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఇండిగో స్పందించింది. ఈ సమయంలో ఎయిర్ ఇండియాకు అండగా నిలుస్తామని వెల్లడించింది.
With profound sorrow I confirm that Air India Flight 171 operating Ahmedabad London Gatwick was involved in a tragic accident today. Our thoughts and deepest condolences are with the families and loved ones of all those affected by this devastating event.
At this moment, our…— Tata Group (@TataCompanies) June 12, 2025