న్యూఢిల్లీ: సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జవాన్ల కోసం శిథిలావస్థలో ఉన్న మురికి రైలును ఏర్పాటు చేయడంపై వివాదం చెలరేగింది. (filthy train for BSF jawans) రైలు బోగీ కిటికీలు, డోర్లు, సీట్లు విరిగిపోవడం, పాడైన టాయిలెట్లు ఉన్న రైలు వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విమర్శల నేపథ్యంలో నలుగురు రైల్వే అధికారులను సస్పెండ్ చేశారు. అమర్నాథ్ యాత్ర విధుల్లో పాల్గొనేందుకు బీఎస్ఎఫ్ జవాన్లు జూన్ 9న త్రిపురలోని ఉదయపూర్ నుంచి జమ్ముకు ప్రయాణించాలి. సుదీర్ఘ ప్రయాణంలో బీఎస్ఎఫ్ జవాన్లు, అధికారులకు సౌకర్యంగా ఉండేందుకు రెండు ఏసీ2-టైర్ కోచ్‌లు, రెండు ఏసీ3-టైర్ కోచ్‌లు, 16 స్లీపర్ కోచ్‌లు, నాలుగు జనరల్, ఎస్ఎల్ఆర్ కోచ్‌లతో కూడిన రైలును ఏర్పాటు చేయాలని రైల్వేను బీఎస్ఎఫ్ కోరింది. త్రిపుర, అస్సాం, పశ్చిమ బెంగాల్‌లోని నాలుగు చోట్ల సిబ్బంది ఆ రైలు ఎక్కుతారని పేర్కొంది.
కాగా, ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్ పరిధిలోని అలీపుర్దువార్ డివిజన్ ఏర్పాటు చేసిన రైలు చూసి బీఎస్ఎఫ్ జవాన్లు షాక్ అయ్యారు. రైలు బోగీల కిటికీలు, తలుపులు విరిగిపోయాయి. విద్యుత్ ఫిట్టింగ్‌లు పనిచేయడం లేదు. టాయిలెట్లు పాడయ్యాయి. శిథిలావస్థలో ఉన్న మురికి రైలుకు సంబంధించిన వీడియో క్లిప్స్ పోషల్ మీడియా వైరల్ అయ్యాయి.
మరోవైపు ఈ సంఘటన రాజకీయంగా దుమారం రేపింది. ఈ నేపథ్యంలో అలీపుర్దువార్ రైల్ డివిజన్‌కు చెందిన ముగ్గురు సీనియర్ సెక్షన్ ఇంజనీర్లు, కోచింగ్ డిపో అధికారిని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సస్పెండ్ చేసినట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. అనంతరం బీఎస్ఎఫ్ జవాన్ల కోసం ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. దీంతో ఉదయపూర్ నుంచి జమ్మూకు బీఎస్ఎఫ్ బృందం ప్రయాణించింది.
కాగా, బీఎస్ఎఫ్ జవాన్లకు శిథిలావస్థలో ఉన్న మురికి రైలును ఏర్పాటు చేసినట్లు వచ్చిన ఆరోపణలను ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్ ఖండించింది. వైరల్ అయిన రైలు వీడియో క్లిప్ బీఎస్ఎఫ్ జవాన్లకు కేటాయించలేదని తెలిపింది. అది మరమ్మతుల కోసం పంపే రైలు అని పేర్కొంది.
1200 BSF soldiers had to join duty on Amarnath Yatra so that they can provide security to devotees.
But, Railways sent a train directly from junkyard for them to travel.
Soldiers refused to board the train by looking the condition.
Look at this train…shame on Ashwini Vaishnav pic.twitter.com/9ckGwsIUWX
— Shantanu (@shaandelhite) June 11, 2025
Also Read:
అహ్మదాబాద్‌లో కూలిన ఎయిర్ ఇండియా విమానం.. 133 మంది మృతి..?
హాస్పిటల్ హాస్టల్ బిల్డింగ్‌పై కూలిన విమానం.. 20 మంది మెడికోలు మృతి..!
త్రిపురలో ‘ట్రయాంగిల్ లవ్ మర్డర్’.. ఐస్‌క్రీమ్ ఫ్రీజర్‌లో వ్యక్తి మృతదేహం