అగర్తల: ఒక యువకుడి మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. ఐస్‌క్రీమ్ ఫ్రీజర్‌లో అతడి మృతదేహాన్ని గుర్తించారు. ‘ట్రయాంగిల్ లవ్ మర్డర్’గా పోలీసులు పేర్కొన్నారు. (Love Triangle Murder) ఇద్దరు మహిళలతో సహా ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. త్రిపురలోని ధలై జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 24 ఏళ్ల సరిఫుల్ ఇస్లాం ఎలక్ట్రీషియన్. అగర్తల స్మార్ట్ సిటీ మిషన్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నాడు. జూన్ 8న అతడు అదృశ్యమయ్యాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా, మూడు రోజుల తర్వాత గండచెర్ర మార్కెట్లోని ఒక షాపులో ఉన్న ఐస్‌క్రీమ్ ఫ్రీజర్‌లో సరిఫుల్ ఇస్లాం మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ట్రయాంగిల్ లవ్ కారణంగా అతడ్ని హత్య చేసినట్లు దర్యాప్తులో తెలిసిందని పోలీస్ అధికారి తెలిపారు. 28 ఏళ్ల డాక్టర్ దిబాకర్ సాహా, అతడి బంధువైన మహిళ, సరిఫుల్ ఇస్లాం మధ్య ట్రయాంగిల్ లవ్ ఉన్నదని చెప్పారు.
మరోవైపు జూన్ 8న రాత్రి వేళ బహుమతి పేరుతో అగర్తలలోని సౌత్ ఇంద్రానగర్ కబర్‌ఖలా ప్రాంతంలో 20 ఏళ్ల జోయ్‌దీప్ దాస్ ఇంటికి సరిఫుల్ ఇస్లాంను దిబాకర్ సాహా పిలిపించాడు. ఆ ఇంటికి వచ్చిన అతడిపై 21 ఏళ్ల అనిమేష్ యాదవ్, 25 ఏళ్ల నబనితా దాస్‌తో కలిసి దిబాకర్ దాడి చేశాడు. సరిఫుల్ గొంతు నొక్కి హత్య చేశారు. రెండు రోజుల కిందట కొనుగోలు చేసిన ట్రాలీ బ్యాగ్‌లో అతడి మృతదేహాన్ని ఉంచారు.
Love Triangle Murder
కాగా, మరుసటి రోజు దిబాకర్ తల్లిదండ్రులైన దీపక్, దేబికా సాహా కలిసి మృతదేహం ఉన్న ఆ ట్రాలీ బ్యాగ్‌తో అగర్తల నుంచి గండచెర్ర మార్కెట్‌కు చేరుకున్నారని పోలీస్ అధికారి తెలిపారు. ఆ తర్వాత వారి షాపులోని ఐస్‌క్రీమ్ ఫ్రీజర్‌లో ట్రాలీ బ్యాగ్‌తో సహా సరిఫుల్ ఇస్లాం మృతదేహాన్ని దాచినట్లు చెప్పారు. సాంకేతిక ఆధారాల ద్వారా జూన్ 10న రాత్రివేళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ హత్య కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడైన డాక్టర్ దిబాకర్ సాహా, అతడి తల్లిదండ్రులు, ఆ మహిళతోపాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి వివరించారు. ఈ కేసుపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
ఘోర ప్రమాదం.. అహ్మదాబాద్‌లో కూలిన ఎయిర్ ఇండియా విమానం
కూలిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ
90 డిగ్రీల మలుపుతో వంతెన నిర్మాణంపై విమర్శలు.. డిజైన్‌ను సమర్థించిన అధికారులు