Plane Crash | గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ (Ahmedabad)లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. మేఘానిలో ఎయిర్ ఇండియాకు చెందిన విమానం కుప్పకూలింది. టేకాఫ్ అయిన నిమిషాల్లోనే సివిల్ ఆసుపత్రి సమీపంలో జనావాసాలపై (Residential Area) విమానం కూలినట్లు జాతీయ మీడియా పేర్కొంటోంది. ప్రమాద సమయంలో విమానంలో 133 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. ప్రమాదం అనంతరం ఆ ప్రాంతంలో దట్టమైన పొగ వ్యాపించింది. విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్నట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read..
Punjab influencer | సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ అనుమానాస్పద మృతి.. కారులో డెడ్‌బాడీ గుర్తింపు
Bengal Violence: బెంగాల్లో హింస.. 40 మంది అరెస్టు
Corona Virus | 24 గంటల్లో 117 కొత్త కేసులు నమోదు.. మూడు మరణాలు