Punjab influencer | ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ (Punjab influencer) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పంజాబ్‌కు చెందిన ఇన్ఫ్లూయెన్సర్ కాంచన్ కుమారీ (Kanchan Kumari) మృతదేహాన్ని బటిండాలోని (Bathinda) ఆదేశ్ మెడికల్ యూనివర్సిటీ క్యాంపస్ సమీపంలోని ఓ కారులో గుర్తించారు. పోలీసులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొన్ని నెలల క్రితం ఆమెకు గ్యాంగ్‌స్టర్ (gangster) అర్ష్‌దల్లా (Arsh Dalla) నుంచి బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
కాంచన్ కుమారీకి గత ఏడాది అక్టోబర్‌లో అర్ష్ దల్లా నుంచి బెదిరింపులు వచ్చాయి. సోషల్ మీడియాలో అనుచిత వీడియోలను పోస్టు చేయడం ఆపాలంటూ గ్యాంగ్‌స్టర్ హెచ్చరించాడు. దీంతో కేసును ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, కాంచన్ కుమారీకి ‘కమల్ కౌర్ భాభీ’గా మంచి గుర్తింపు ఉంది. ఇన్స్టాగ్రామ్ వెరిఫైడ్ ఖాతాలో 3.83 లక్షల మందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు.
Also Read..
Raghuvanshi | నా భర్తను నేనే చంపా.. పోలీసుల వద్ద ఒప్పుకున్న సోనమ్
ముస్కాన్ రస్తోగి నుంచి సోనమ్ వరకు.. అక్రమ సంబంధంతో భాగస్వాములను చంపేసిన కిల్లర్ లవర్స్ !
Bengal Violence: బెంగాల్లో హింస.. 40 మంది అరెస్టు