హనుమకొండ చౌరస్తా, జూన్ 12: హనుమకొండ కిషన్‌పురలోని చైతన్య(డీమ్డ్ టు బీ విశ్వవిద్యాలయం) డిగ్రీ, ఫార్మసీ, ఇంజినీరింగ్ పరీక్షల ఫలితాలను ఉపకులపతి ఆచార్య జి.శంకర్లింగం విడుదల చేశారు. డిగ్రీ 4, 6 సెమిస్టర్ పరీక్షల్లో మొత్తం 809 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 641(79.23 శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు, బీఫార్మసీ 8, 6 సెమిస్టర్లో 195 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 152(77.94) మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు పేర్కొన్నారు.
ఫార్మ్‌డీ 3, 4, 5, 6వ సంవత్సరాల్లో మొత్తం 69 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 65(94.20) మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు, ఇంజినీరింగ్ 8, 6వ సెమిస్టర్ పరీక్షలలో మొత్తం 385 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 350(90.90 శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య ఎం.రవీందర్, అడ్మినిస్ట్రేషన్ డీన్ ఆచార్య ఎస్.కవిత, చైతన్య డీమ్డ్ విశ్వవిద్యాలయ డిప్యూటీ పరీక్షల నియంత్రణాధికారులు, వివిధ శాఖాధిపతులు, డాక్టర్ బి.రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.