కట్టంగూర్, జూన్ 12 : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు గోదల రాధమ్మ 13వ వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం కట్టంగూర్ మండలంలోని పొందనపల్లి గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, గ్రామస్తులు రాధమ్మ ఫ్లెక్సీకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాధమ్మ కుటుంబ సభ్యులు గ్రామస్తులకు వండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గోదల కృష్ణారెడ్డి, గోదల పురుషోత్తంరెడ్డి, కుంభం తారకమ్మ, గద్దపాటి రాములమ్మ, బండారు ఊర్మిళమ్మ, కుంభం శ్రీనివాస్డ్డి, బండ అంజిరెడ్డి, గోదల జ్యోతి, దోములపల్లి యాదయ్య, గజ్జి రాములు, ఈరమ్మ, కావటి యాదగిరి గద్దపాటి కృష్ణయ్య, గద్దపాటి పిచ్చయ్య, గజ్జి నర్సింహ్మ, సంకటి పెద నర్సింహ్మ, గద్దపాటి ముత్తమ్య, గద్దపాటి భిక్షమయ్య పాల్గొన్నారు.