Shubman Gill : భారత టెస్టు సారథిగా ఎంపికైన శుభ్‌మన్ గిల్ (Shubman Gill) త్వరలోనే ఇంగ్లండ్ పరీక్షను ఎదుర్కోనున్నాడు. సీనియర్లు రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli)లు వీడ్కోలు పలకిన వేళ .. సుదీర్ఘ ఫార్మాట్‌కు 37వ సారథిగా ఎంపికైన గిల్ తన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నాడు. రోహిత్, విరాట్ నాయకత్వంలో ఆడిన ఈ కుర్రాడు ఇప్పుడు కెప్టెన్‌గా టీమిండియాను గెలుపు శిఖరాల వైపు నడపనున్నాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)ను ప్లే ఆఫ్స్ చేర్చిన గిల్.. టెస్టు సారథ్యంపై తొలిసారి స్పందించాడు.
తన అభిమాన క్రికెటర్లు అయిన రోహిత్, కోహ్లీలలోని కెప్టెన్సీ లక్షణాలను తాను పుణికి పుచ్చుకోవాలని భావిస్తున్నట్టు వెల్లడించాడీ యువ సారథి. ‘రోహిత్, కోహ్లీ.. ఇద్దరి కెప్టెన్సీ విభిన్నంగా ఉంటుంది. అయితే.. వాళ్లిద్దరి లక్ష్యం ఒక్కటే జట్టును గెలిపించాలి. వీళ్లలో ఈ కామన్ పాయింట్ నాకు బాగా నచ్చేది. కెప్టెన్‌గా విజయం సాధించాలంటే ప్రత్యేకమైన స్టయిల్ ఉండాలి. విరాట్ విషయానికొస్తే.. మైదానంలో చాలా దూకుడుగా ఉంటాడు. జట్టును ముందుండి నడిపించాలని ఆరాటపడుతాడు.
𝐀 𝐧𝐞𝐰 𝐞𝐫𝐚 𝐛𝐞𝐠𝐢𝐧𝐬 ✨
Get ready to hear from #TeamIndia Test Captain Shubman Gill himself 🗣
Stay tuned for the full interview ⌛ @ShubmanGill pic.twitter.com/zWVlFdMD61
— BCCI (@BCCI) May 25, 2025
హిట్‌మ్యాన్ కూడా దూకుడైన సారథే. కానీ, కోహ్లీలా భావోద్వేగాలను పైకి కనిపించనీయడు. ఫీల్డ్‌లో వ్యూహాలు పన్నడంలో దిట్ట అయిన రోహిత్ నుంచి టమిని ఒప్పుకోని కోహ్లీ నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నా. వీళ్లిద్దరిలోని లక్షణాలు అలవర్చుకొని.. నాయకుడిగా నా ముద్ర వేయడంపై దృష్టి సారిస్తాను. చెప్పాలంటే నా కెప్టెన్సీ మంత్ర ఇదే’ అని బీసీసీఐ (BCCI) షేర్ చేసిన వీడియోలో గిల్ వెల్లడించాడు.
అంతేకాదు ఆటగాళ్లతో తరచూ సంభాషించడం.. వాళ్లతో అద్భుత ఫలితాలు సాధించడం వంటివి రోహిత్‌తో తనకు నచ్చుతాయని గిల్ చెప్పాడు. ‘రోహిత్ చాలా ప్రశాంతంగా ఉంటాడు. ప్రతి ఆటగాడితో మాట్లాడుతూ.. వాళ్ల బాధ్యతలను గుర్తు చేస్తాడు. తాను వాళ్ల నుంచి ఏం కోరుకుంటున్నాడు అనేది స్పష్టంగా చెబుతాడు. సీనియర్లు రోహిత్, కోహ్లీతో పాటు అశ్విన్ (Ashwin) కూడా మాకు స్ఫూర్తిదాయకమే.
విదేశాల్లో ఎలా ఆడాలి? ప్రత్యర్థి ఎత్తులను ఎలా చిత్తు చేయాలి? అనే విషయాల్ని ఈ ముగ్గురు మాకు ఆచరించి చూపించారు. సో.. కెప్టెన్‌గా నేను వీళ్ల బాటలోనే పయనిస్తాను’ అని గిల్ తెలిపాడు. ఇంగ్లండ్ పర్యటనతో పగ్గాలు చేపట్టనున్న గిల్.. ఇప్పటివరకూ 32 టెస్టు మ్యాచులు ఆడాడు. 5 సెంచరీలు, 7 అర్ధ శతకాలు కలిపి 1,893 రన్స్ సాధించాడు.
Shubman Gill-led #TeamIndia are READY for an action-packed Test series 💪
A look at the squad for India Men’s Tour of England 🙌#ENGvIND | @ShubmanGill pic.twitter.com/y2cnQoWIpq
— BCCI (@BCCI) May 24, 2025
భారత స్క్వాడ్ : శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రిషభ్ పంత్(వైస్ కెప్టెన్, వికెట్ కీపీర్), యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్ధూల్ ఠాకూర్, బుమ్రా, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ