పాట్నా: బీహార్‌కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తన పెద్ద కుమారుడైన తేజ్ ప్రతాప్ యాదవ్‌ను పార్టీతో పాటు కుటుంబం నుంచి బహిష్కరించారు. (Tejashwi Yadav On Tej Pratap) ఫేస్బుక్లో ఒక మహిళ ఫొటో షేర్ చేసి ఆమెతో 12 ఏళ్ల అనుబంధం గురించి బయటపెట్టిన తేజ్ ప్రతాప్‌పై ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఆర్జేడీలో కీలకంగా వ్యవహరించే లాలూ రెండో కుమారుడు తేజస్వి యాదవ్ ఈ సంఘటనపై స్పందించారు. తన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ పెద్దవాడని, సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు ఆయనకు ఉందని తెలిపారు. అయితే తన సోదరుడి బహిష్కరణపై తండ్రి తీసుకున్న నిర్ణయం చెల్లుతుందని చెప్పారు. ఇలాంటి వాటిని పార్టీ సహించదని అన్నారు. బీహార్ ప్రజల కోసం తాము అంకితభావంతో పనిచేస్తున్నట్లు వెల్లడించారు.
Anushka Yadav
కాగా, తన ఫేస్బుక్ పేజీ హ్యాక్ అయిందని తేజ్ ప్రతాప్ యాదవ్ తెలిపారు. అయితే నైతిక విలువలను విస్మరించినందుకు తన కుమారుడ్ని పార్టీతో పాటు కుటుంబం నుంచి బహిష్కరించినట్లు లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించారు. ‘నా పెద్ద కొడుకు కార్యకలాపాలు, ప్రజా ప్రవర్తన, బాధ్యతారహిత ప్రవర్తన మా కుటుంబ విలువలు, సంప్రదాయాలకు అనుగుణంగా లేవు. అందువల్ల, పైన పేర్కొన్న పరిస్థితుల కారణంగా, నేను అతడ్ని పార్టీ, కుటుంబం నుంచి తొలగిస్తున్నా. ఇక నుంచి పార్టీ, కుటుంబంలో అతడికి ఎలాంటి పాత్ర ఉండదు. అతడ్ని ఆరు సంవత్సరాల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నా’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.
#WATCH | Patna | RJD chief Lalu Prasad Yadav expels his elder son, Tej Pratap Yadav from the party for 6 years, he also removed him from the family.
RJD leader Tejashwi Yadav says, “We cannot tolerate such things, we are working and are dedicated to the people of Bihar. If it’s… pic.twitter.com/gSJ5ubyIyz
— ANI (@ANI) May 25, 2025