IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ చివరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) తడబడుతోంది. చెన్నై సూపర్ కింగ్స్(CSK) నిర్దేశించిన భారీ ఛేదనలో ఆ జట్టు మూడు కీలక వికెట్లు కోల్పోయింది. అది కూడా పవర్ ప్లేలోనే. 18వ సీజన్లో 6 ఓవర్ల లోపే ఓపెనర్ శుభ్‌మన్ గిల్(13), జోస్ బట్లర్(5), షెర్ఫానే రూథర్‌ఫొర్డ్(0)లు పెవిలిన్ చేరడం ఇదే మొదటిసారి. కష్టాల్లో పడిన జట్టును ఓపెనర్ సాయి సుదర్శన్(41 నాటౌట్), షారుక్ ఖాన్(19 నాటౌట్)లు ఆదుకునే ప్రయత్నంలో ఉన్నారు.
శివం దూబే వేసిన 10వ ఓవర్లో సాయి వరుసగా రెండో ఫోర్లు కొట్టగా.. షారుక్ ఖాన్ స్ట్రెయిట్‌గా సిక్సర్ బాదగా స్కోర్ 80 దాటింది. 10 ఓవర్లకు ఓవర్లకు గుజరాత్ స్కోర్.. 85-3. ఇంకా విజయానికి 146 పరుగులు చేయాల్సి ఉంది.
A 𝐒𝐮𝐩𝐞𝐫 start for the 𝐊𝐢𝐧𝐠𝐬 💛
Anshul Kamboj & Khaleel Ahmed wreaking havoc with the ball in the powerplay! 💥#GT are 30/3 after 5 overs.
Updates ▶ https://t.co/P6Px72jm7j#TATAIPL | #GTvCSK | @ChennaiIPL pic.twitter.com/3N9V7EHYw9
— IndianPremierLeague (@IPL) May 25, 2025
వరుసగా రెండో మ్యాచ్‌లో 200 ప్లస్ ఛేదనకు సిద్దమైన గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్. దంచి కొడుతున్న శుభ్‌మన్ గిల్(13) మూడో ఓవర్లోనే పెవిలియన్ చేరాడు. అన్షుల్ కంబోజ్ ఓవర్లో అతడు ఉర్విల్ పటేల్ చేతికి చిక్కాడు. 24కే తొలి వికెట్ పడిన వేళ జోస్ బట్లర్(5), సాయి సుదర్శన్(41 నాటౌట్)తో కలిసి జట్టును ఆదుకుంటాడని అనుకుంటే.. అతడిని ఖలీల్ వెనక్కి పంపాడు. వరుసగా రెండు వికెట్ల షాక్ నుంచి తేరుకునేలోపే.. డేంజరస్ హిట్టర్ రూథర్‌ఫొర్డ్(0)ను అన్షుల్ డకౌట్ చేశాడు. అంతే.. గుజరాత్ 5వ ఓవర్ మూడో బంతికే మూడో కోల్పోయింది. తద్వారా ఈ సీజన్లో శుభ్‌మన్ గిల్ సేన తొలిసారి పవర్ ప్లేలో మూడు వికెట్లు కోల్పోయింది.