న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 1 వద్ద ఉన్న రూఫ్ కొంత భాగం కూలిపోయింది. (Part of Roof Collapses At Delhi Airport) దీంతో అక్కడున్న వ్యక్తులు భయంతో పరుగులుతీశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీలో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1 వద్ద టెంట్ మాదిరిగా ఉన్న రూఫ్లోకి వర్షం నీరు చేరింది. దీంతో కొంతభాగం కూలిపోయింది. అందులో ఉన్న వర్షం నీరు అన్నివైపులా ప్రవహించింది. ఇది చూసి అక్కడున్న వ్యక్తులు భయంతో దూరంగా పరుగెత్తారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, ఢిల్లీలో భారీ వర్షం కారణంగా 17 అంతర్జాతీయ విమానాలతో సహా 49 విమానాలను దారి మళ్లించారు. వర్షం వల్ల విమానాశ్రయంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో నీరు నిలిచిందని, దీంతో విమాన కార్యకలాపాలపై ప్రభావం పడిందని ఢిల్లీ విమానాశ్రయం ఒక ప్రకటనలో తెలిపింది.
This morning: The capital city, Delhi, was thrown into chaos by heavy rainfall. The impact extended to Delhi Airport, which was also affected by the water havoc. https://t.co/KHWeDXLwyi pic.twitter.com/MyQ7qc8s5c
— Weather Monitor (@WeatherMonitors) May 25, 2025