IPL 2025 : చివరిదైన లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) బ్యాటర్లు చెలరేగారు. ఆకలిగొన్న సింహల్లా గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)బౌలర్లపై విరుచుకుపడి బౌండరీలతో విజృంభించారు. ఓపెనర్ డెవాన్ కాన్వే(52) భారీ స్కోర్‌కు పునాది వేయగా.. ఆఖర్లో కుర్రాడు డెవాల్డ్ బ్రెవిస్(57) ఆకాశమే హద్దుగా ఆడాడు. ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన బ్రెవిస్.. చెన్నై స్కోర్ 200 దాటించాడు. డెత్ ఓవర్లలో జడేజాతో కలిసి శివాలెత్తిపోయిన ఈ చిచ్చరపిడిగు సిరాజ్ బౌలింగ్‌లో 6, 4తో అర్ధ శతకం సాధించాడు. కాన్వే, బ్రెవిస్ మెరుపులతో, చెన్నై నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి పరుగులు చేసింది. వరుసగా రెండో లీగ్ మ్యాచ్‌లోనూ గుజరాత్ 200 ప్లస్ లక్ష్య ఛేదనకు దిగనుంది.
ప్లే ఆఫ్స్ చేరలేకపోయిన చెన్నై సూపర్ కింగ్స్ చివరి పోరులో భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ధోనీ సేన ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. అర్షద్ ఖాన్ ఓవర్లో ఓపెనర్ ఆయుష్ మాత్రే (34) రెచ్చిపోయాడు. వరుసగా 6, 6, 4, 4, 6తో 24 పరుగులు పిండుకున్నాడు. డెవాన్ కాన్వే(52)లు అదిరే ఆరంభం ఇచ్చారు. మాత్రేతో కలిసి 44 రన్స్ జోడించిన కాన్వే.. అనంతరం.. ఉర్విల్ పటేల్(37)తో కలసిఇ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.
Innings Break!#CSK brought the fireworks with a power-packed batting effort to set a 🎯 of 2⃣3⃣1⃣
Will #GT chase it down and seal 🔝 spot?
Updates ▶ https://t.co/P6Px72jm7j#TATAIPL | #GTvCSK | @ChennaiIPL | @gujarat_titans pic.twitter.com/PE8QyHsLww
— IndianPremierLeague (@IPL) May 25, 2025
దూకుడుగా ఆడిన ఉర్విల్ రెండో వికెట్‌కు 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. సాయి కిశోర్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన ఉర్విల్.. ఆ తర్వాత క్రీజు వదిలి పెద్ద షాట్‌కు యత్నించి మిడాఫ్‌లో శుభ్‌మన్ గిల్ చేతికి దొరికాడు. దాంతో, 107 వద్ద చెన్నై రెండో వికెట్ పడింది. ఆ తర్వత క్రీజులోకి వచ్చిన శివం దూబే ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాసేపటికే రషీద్ ఖాన్ ఓవర్లో సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు కాన్వే. అయితే.. ఆ తర్వాత బంతికే పెద్ద షాట్ ఆడబోయి బంతిని మిస్ అయ్యి.. క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
దూబే, కాన్వేలు వరుసగా ఔట్ కావడంతో చెన్నైకి భారీ స్కోర్ అందించే బాధ్యత డెవాల్డ్ బ్రెవిస్(57) తీసుకున్నాడు. తన పవర్ హిట్టింగ్తో గుజరాత్ బౌలర్లను బెంబేలెత్తించిన ఈ కుర్రాడు రవీంద్ర జడేజా(21 నాటౌట్)తో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. బౌండరీలతో చెలరేగిన బ్రెవిస్.. సిరాజ్ వేసిన 19వ ఓవర్లో 6, 4 బాది 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రసిధ్ వేసిన 20వ ఓవర్ ఐదో బంతిని స్టాండ్స్‌లోకి పంపిన ఈ యంగ్‌స్టర్ చివరి బంతికి ఔటయ్యాడు. దాంతో, చెన్నై నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది.