IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ ప్లేఆఫ్స్ మ్యాచ్‌లకు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)కు గుడ్‌న్యూస్. తొలి టైటిల్ కలను సాకారం చేసుకోవాలనుకుంటున్న ఆ జట్టు పేస్ బలం మరింత పెరగనుంది. టోర్నీ పునరుద్ధరణ తర్వాతి రెండు లీగ్ మ్యాచ్‌లకు దూరమైన ప్రధాన పేసర్ జోష్ హేజిల్‌వుడ్ (Josh Hazlewood) తిరిగి స్క్వాడ్‌తో కలిశాడు. ఆదివారం ఈ విషయాన్ని ఆర్సీబీ హెడ్‌కోచ్ దినేశ్ కార్తిక్ వెల్లడించాడు.
‘హేజిల్‌వుడ్ మళ్లీ ఆర్సీబీతో కలవడం పట్ల యావత్ బెంగళూరు సంతోషంగా ఉంది. ఎందుకంటే.. పవర్ ప్లే, డెత్ ఓవర్లలో తాను ఎంత ప్రమాదకరమైన బౌలరో హేజిల్ నిరూపించాడు. ఇప్పుడు అతడు మాతో ఉన్నాడు. ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉండడం నిజంగా మాకు ప్లస్ పాయింట్’ అని కార్తిక్ తెలిపాడు.
How’s the Josh, 12th Man Army? 😌 pic.twitter.com/nPryKXkqjM
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 25, 2025
మే 17న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షార్ఫణం కావడంతో.. ఆఖరి రెండింటిలో అయినా విజయంతో ఆత్మవిశ్వాసంతో నాకౌట్ మ్యాచ్‌లకు సిద్ధం కావాలని భావించింది. అయితే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ షాక్ ఇవ్వడంతో 42 పరుగుల తేడాతో ఓడిపోయింది. దాంతో, చివిరదైన లీగ్ మ్యాచ్‌లో మే27 లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆర్సీబీ తలపడనుంది.
తొలి టైటిల్ వేటలో ఉన్న ఆర్సీబీ 18వ సీజన్లో అదరగొట్టడంలో హేజిల్‌వుడ్ పాత్ర ఉంది. పవర్ ప్లే, డెత్ ఓవర్లలో నిప్పులు చెరుగుతూ పరుగులను నియంత్రించే ఈ స్పీడ్‌స్టర్.. బెంగళూరుకు ప్రధాన పేస్ అస్త్రంగా మారాడు. అయితే.. భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రికత్తల కారణంగా టోర్నీ వాయిదా పడడంతో జోష్ హేజిల్‌వుడ్ స్వదేశం వెళ్లపోయాడు.
భుజం గాయంతో బాధపడుతున్న అతడు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ ఆడాల్సి ఉంది. కాబట్టి..కొన్నిరోజులు విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాడు. కానీ, ప్లే ఆఫ్స్ పోరులో రజత్ పాటిదార్ బృందానికి తన సేవలు అవసరమని భావించిన ఈ పొడగరి పేసర్ తిరిగి స్క్వాడ్‌లో కలిశడు. ఇప్పటివరకూ హేజిల్‌వుడ్ ఐపీఎల్ 18వ సీజన్లో 17. 27 సగటుతో 18 వికెట్లు పడగొట్టాడు