IPL 2025 : అహ్మదాబాద్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ డెవాన్ కాన్వే(52) మెరుపు అర్ధ శతకం సాధించాడు. ఓపెనర్ మాత్రే, ఉర్విల్ పటేల్‌తో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పిన కాన్వే.. రషీధ్ ఖాన్ బౌలింగ్‌లో సిక్సర్‌తో అర్ధ శతకం సాధించాడు. అయితే.. ఆ తర్వాత బంతికే పెద్ద షాట్ ఆడబోయి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో, 156 వద్ద సీఎస్కే నాలుగో వికెట్ పడింది. ప్రస్తుతం డెవాల్డ్ బ్రెవిస్(6), రవీంద్ర జడేజా(1)లు క్రీజులో ఉన్నారు. చెన్నై రెండొందలు కొట్టడం అనేది వీళ్లిద్దరిపై ఆధారపడి ఉంది. 14 ఓవర్లకు సీఎస్కే స్కోర్.. 158-4.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి ఓపెనర్లు ఆయుష్ మాత్రే(34), డెవాన్ కాన్వే(52)లు అదిరే ఆరంభం ఇచ్చారు. మాత్రేతో కలిసి 44 రన్స్ జోడించిన కాన్వే.. అనంతరం.. ఉర్విల్ పటేల్(37)తో కలసిఇ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. దూకుడుగా ఆడిన ఉర్విల్ రెండో వికెట్‌కు 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. సాయి కిశోర్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన ఉర్విల్.. ఆ తర్వాత క్రీజు వదిలి పెద్ద షాట్‌కు యత్నించి మిడాఫ్‌లో శుభ్‌మన్ గిల్ చేతికి దొరికాడు. దాంతో, 107 వద్ద చెన్నై రెండో వికెట్ పడింది.
The word ‘fear’ isn’t in their dictionary 🔥#CSK‘s young guns Ayush Mhatre and Urvil Patel added to the Ahmedabad heat with their knocks 👏
Updates ▶ https://t.co/P6Px72jm7j#TATAIPL | #GTvCSK | @ChennaiIPL pic.twitter.com/KcM4XW9peg
— IndianPremierLeague (@IPL) May 25, 2025