Russia attack | ఉక్రెయిన్‌పై డ్రోన్లు, క్షిపణులతో రష్యా భీకర దాడులు
Russia attack | ఉక్రెయిన్-రష్యా (Ukraine - Russia) దేశాల మధ్య ఒకవైపు యుద్ధ ఖైదీల మార్పిడి (Prisoners swap) జరుగుతుంటే మరోవైపు యుద్ధం (War) జరుగుతోంది. ఇరుదేశాల మధ్య పరస్పర దాడులకు మాత్రం అడ్డుకట్ట పడటంలేదు.
Russia attack : ఉక్రెయిన్-రష్యా (Ukraine – Russia) దేశాల మధ్య ఒకవైపు యుద్ధ ఖైదీల మార్పిడి (Prisoners swap) జరుగుతుంటే మరోవైపు యుద్ధం (War) జరుగుతోంది. ఇరుదేశాల మధ్య పరస్పర దాడులకు మాత్రం అడ్డుకట్ట పడటంలేదు. ఆదివారం వందలాది మంది సైనికులు, పౌరులను విడిచిపెట్టిన రష్యా.. అంతకు కొన్ని గంటల ముందే ఉక్రెయిన్‌పై భీకర దాడులకు తెగబడింది. ఏకంగా 298 డ్రోన్లు, 69 క్షిపణులతో దాడికి పాల్పడింది.
రష్యా తాజా దాడుల్లో 12 మంది మృతిచెందారు. మూడేళ్ల యుద్ధంలో ఒకేసారి ఈ స్థాయిలో డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేయడం ఇదే తొలిసారని ఉక్రెయిన్ సైనిక వర్గాలు వెల్లడించాయి. కాగా యుద్ధ ఖైదీల అప్పగింతలో భాగంగా శుక్రవారం ఇరుదేశాలు 390 మంది చొప్పున యుద్ధ ఖైదీలను మార్పిడి చేసుకోగా.. శనివారం 307 మంది చొప్పున మార్పిడి చేసుకున్నాయి. తాజాగా ఆదివారం 303 మంది చొప్పున సైనికులను పరస్పరం అప్పగించుకున్నట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది.
అయితే ఈ ప్రకటన రాకముందు ఉక్రెయిన్‌లోని కీవ్‌తోపాటు ఇతర ప్రాంతాలపై మాస్కో భీకర దాడులు చేసింది. ఒకేరోజు 69 క్షిపణులు, 298 డ్రోన్లతో విరుచుకుపడింది. వీటిలో ఇరాన్ రూపొందించిన షాహెద్ డ్రోన్లు కూడా ఉన్నట్లు సమాచారం. మొత్తంగా ఈ దాడుల్లో 12 మంది చనిపోగా అనేకమంది గాయాలపాలయ్యారు. ఉక్రెయిన్‌లోని 30 నగరాలు, గ్రామాలపై ఉద్దేశపూర్వక దాడులు జరిగాయని అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు.
తాజా దాడి నేపథ్యంలో రష్యాపై ఆంక్షలు విధించాలని పాశ్చాత్య దేశాలను అభ్యర్థించారు. రష్యా నాయకత్వంపై బలమైన ఒత్తిడి తీసుకువస్తే తప్పితే ఈ దారుణాలకు అడ్డుకట్ట వేయలేమని పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

