Allu Aravind | గత కొన్ని రోజులుగా థియేటర్ల బంద్ అంటూ తెలుగు ఇండస్ట్రీలో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. పర్సంటేజ్ విధానంలో సినిమాలు విడుదల చేయాలని ఎగ్జిబిటర్లు కోరుతుండగా, అలా చేస్తే తమకు తీవ్ర నష్టం వస్తుందని నిర్మాతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 1వ తేదీ నుంచి సినిమా హాళ్లను బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. అయితే ఈ సమస్యను చర్చించి పరిష్కరించుకుందమంటూ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించింది.
అయితే, థియేటర్ల బంద్ నిర్ణయం వెనుక కుట్ర ఉందని జనసేన ఆరోపిస్తోంది. పవన్ కల్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా జూన్ 12న విడుదల కానున్న నేపథ్యంలో, టాలీవుడ్‌కి చెందిన నలుగురు ప్రముఖ నిర్మాతలు కుట్ర చేశారని జనసేన తీవ్రంగా ఆరోపిస్తోంది. ఇందులో అల్లు అరవింద్ పేరు కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై అల్లు అరవింద్ స్పందించారు.
అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడుతూ.. ఆ నలుగురు లో నేను లేను.. తెలుగు రాష్ట్రాల్లో 1500 థియేటర్స్ ఉంటే అందులో 15 లోపే నా ఆధీనంలో ఉన్నాయి. నన్ను ఆ నలుగురు లో కలపకండి. తెలంగాణ లో నా దగ్గర ఒక్క థియేటర్ లేదంటూ అల్లు అరివింద్ చెప్పుకోచ్చాడు.