Team India Squad : శ్రీలంక పర్యటన కోసం భారత జట్టు ఎంపికపై సందిగ్ధం వీడింది. పొట్టి వరల్డ్ ప్రపంచ కప్ తర్వాత నుంచి నలుగుతున్న తుది బృందం కసరత్తు కొలిక్కి వచ్చింది. దాంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) గురువారం టీమిండియా స్క్వాడ్‌ను ఖరారు చేసింది. అందరూ ఊహించినట్టుగానే వరల్డ్ కప్ హీరో హార్దిక్ పాండ్యా (Hardhik Pandya) స్థానంలో టీ20 సారథిగా సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యాడు. అంతేకాదు పాండ్యాకు డబుల్ షాకిస్తూ సెలెక్టర్లు రెండు ఫార్మట్లకు యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు.
హెడ్ కోచ్‌గా తొలి పర్యటన కావడంతో గౌతం గంభీర్ (Gautam Gautam) స్క్వాడ్ ఎంపికలో తన ముద్ర వేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer), పేసర్ హర్షిత్ రానాలకు 15 మంది బృందంలో చోటు దక్కేలా చూశాడు.

ఇక టీ20 వరల్డ్ కప్ టోర్నీకి దూరమైన సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్(KL Rahul)ను వన్డే ఫార్మాట్‌కు వికెట్ కీపర్‌గా అవకాశం దక్కింది. జూలై 28వ తేదీన పల్లెకెలె స్టేడియంలో టీ20 సిరీస్ ఆరంభం కానుంది. ఆగస్టు 2వ తేదీన కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగే మ్యాచ్‌తో వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది.
భారత టీ20 బృందం : సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), రింకూ సింగ్, రియాన్ పరాగ్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, సిరాజ్.
– Bumrah rested for the tour, Virat and Rohit to feature
– Shreyas, KL Rahul make ODI return
– Hardik to play T20Is, Jadeja not included in ODIsWhat are your first thoughts on the squad? 🤔 https://t.co/UnAFWK9EIS #SLvIND pic.twitter.com/OLxGsArkDh
— ESPNcricinfo (@ESPNcricinfo) July 18, 2024
భారత వన్డే బృందం : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, రియాన్ పరాగ్, శివం దూబే, కుల్దీప్ యాదవ్, సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రానా.