Rail Accident : యూపీలో చండీగఢ్-డిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ప్రమాదంపై యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సత్వర దర్యాప్తు చేపట్టాలని కోరారు. ఇటీవల వరుసగా పలు రైలు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ ప్రమాదాల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని అజయ్ రాయ్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఘటనలకు రైల్వే మంత్రి బాధ్యత వహించాలని, ఆయన తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని రాయ్ డిమాండ్ చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన బాధితుల కుటుంబసభ్యులకు రూ. 50 లక్షల పరిహారం అందించాలని కోరారు. కాగా, ఉత్తరప్రదేశ్లో గురువారం మధ్యాహ్నం 2.35 గంటల ప్రాంతంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది.
గోండా జిల్లాలో గోండా-మాంకాపూర్ రైల్వే సెక్షన్ మధ్య చండీగఢ్-డిబ్రూగఢ్ (15904) ఎక్స్ప్రెస్ రైలు 14 కోచ్లు పట్టాలు తప్పాయి. ఘటనలో ఇప్పటి వరకు నలుగురు ప్రయాణికులు మృతి చెందగా.. మరో 20 మంది వరకు గాయపడ్డట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. రైలు ఛండీగఢ్ నుంచి గోరఖ్పూర్ వెళ్తున్న సమయంలో మోతిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పికౌరా గ్రామ సమీపంలో ఘటన చోటు చేసుకున్నది.
Read More :
Watch: మహిళా కానిస్టేబుల్ డ్రైవ్ చేస్తున్న స్కూటీని ఢీకొట్టిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే?