Watch: మహిళా కానిస్టేబుల్ డ్రైవ్ చేస్తున్న స్కూటీని ఢీకొట్టిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే?
Woman Cop Flying Into Air | మహిళా కానిస్టేబుల్ డ్రైవ్ చేస్తున్న స్కూటీని ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఆమె గాల్లోకి ఎగిరిపడింది. స్కూటీ వెనుక ఉన్న మరో కారు, గ్యాస్ సిలిండర్ల లోడ్‌తో ఉన్న టెంపోను కూడా ఆ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
చెన్నై: మహిళా కానిస్టేబుల్ డ్రైవ్ చేస్తున్న స్కూటీని ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఆమె గాల్లోకి ఎగిరిపడింది. (Woman Cop Flying Into Air) స్కూటీ వెనుక ఉన్న మరో కారు, గ్యాస్ సిలిండర్ల లోడ్‌తో ఉన్న టెంపోను కూడా ఆ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ సంఘటన జరిగింది. తిరుముల్లైవాయల్ ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల పవిత్ర, పోరూర్ మహిళా పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నది. బుధవారం డ్యూటీ తర్వాత స్కూటీపై ఇంటికి వెళ్తున్నది.
కాగా, ఎదురు నుంచి వేగంగా వచ్చిన కారు ఆ స్కూటీని ఢీకొట్టింది. దీంతో మహిళా పోలీస్ కానిస్టేబుల్ పవిత్ర గాల్లోకి ఎగిరి దూరంగా పడింది. ఆమె స్కూటర్ వెనుక వస్తున్న కారుతోపాటు గ్యాస్ సిలిండర్ల లోడ్‌తో ఉన్న టెంపోను కూడా ఆ కారు ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తు గ్యాస్ సిలిండర్లు పేలలేదు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.
మరోవైపు ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన మహిళా కానిస్టేబుల్ పవిత్రను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది.
ప్రమాదానికి కారణమైన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న డ్రైవర్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
சென்னை அயப்பாக்கத்தில் சாலையின் வலதுபுறம் ஏறி அதிவேகமாகச் சென்ற கார் மோதி பைக்கில் சென்ற பெண் காவலர் தூக்கி வீசப்பட்டு படுகாயம்#Chennai | #Accident | #Car | #TwoWheeler | #WomanPolice | #Polimernews pic.twitter.com/mWaEwKrwt9
— Polimer News (@polimernews) July 17, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Chennai
- Flying Into Air
- Hits
- scooty
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

