FIFA Rankings : ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత జట్టుకు షాక్ తగిలింది. మూడు స్థానాలు దిగజారి 124వ ర్యాంక్ దక్కించుకుంది. ఇక ఆసియా టీమ్‌ల జాబితాలో భారత్ 22వ ర్యాంక్‌తో సరిపెట్టుకుంది. గురువారం ఫిఫా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో అర్జెంటీనా (Argentina) అగ్రస్థానం సొంతం చేసుకుంది. వరుసగా రెండో ఏడాది కోపా అమెరికా కప్ కొట్టడం మెస్సీ సేనను నంబర్ 1 చేసింది. ఫ్రాన్స్ రెండో స్థానంలో నిలవగా.. యూరో చాంపియన్‌షిప్ గెలుపొందిన స్పెయిన్ (Spain) మూడో స్థానానికి దూసుకొచ్చింది.
నిరుడు స్వదేశంలో వరుస ట్రోఫీలు గెలిచిన భారత ఫుట్‌బాల్ జట్టు ఆ తర్వాత తేలిపోయింది. సునీల్ ఛెత్రీ కెప్టెన్‌గా, ఇగర్ స్టిమాక్ హెడ్‌కోచ్‌గా ఉన్నప్పుడు టీమిండియా ప్రపంచవ్యాప్తంగా వంద లోపు, ఆసియాలో 15లోపు ర్యాంక్‌లో ఉండేది. కానీ, ఈ ఇద్దరూ జట్టును వీడడంతో భారత ఫుట్‌బాల్ పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
గత ఏడాది డిసెంబర్ నుంచి టీమిండియా ఆట గాడీ తప్పింది. ఛెత్రీ, స్టిమాక్ ఆధ్వర్యంలో తొలిసారి 99వ ర్యాంక్‌తో రికార్డు నెలకొల్పిన బ్లూ టైగర్స్.. వరల్డ్ కప్ 2026 క్వాలిఫయర్స్‌లో ఘోరంగా విఫలైమంది. ఖతార్ చేతిలో వరుస ఓటములతో వరల్డ్ కప్ బెర్తు కోల్పోయిన భారత్.. తాజాగా ర్యాంకింగ్స్‌లోనూ నిరాశపరిచింది.
ఫిఫా ర్యాంకింగ్స్‌లో యూరో చాంపియన్‌షిప్, కోపా అమెరికా కప్‌లో అదరగొట్టిన జట్లకు టాప్ 10లో చోటు దక్కింది. అర్జెంటీనా, ఫ్రాన్స్, స్పెయిన్లు తొలి మూడు స్థానాలు సాధించాయి. ఇంగ్లండ్, బ్రెజిల్‌లు నాలుగు, ఐదో స్థానంలో నిలిచాయి. బెల్జియం, నెదర్లాండ్స్, పోర్చుగల్, కొలంబియా, ఇటలీలు ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.
Some BIG movements in the latest #FIFARanking! 📈
— FIFA World Cup (@FIFAWorldCup) July 18, 2024