ముంబై, జనవరి 5: టాటా గ్రూపునకు చెందిన విమానయాన సంస్థలైన ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లకు నూతన బాస్‌లు రాబోతున్నారు. ప్రస్తుతం సీఈవోగా విధులు నిర్వహిస్తున్న క్యాంప్‌బెల్ విల్సన్ తన పదవీకాలం వచ్చే ఏడాది ముగియనుండటంతో ఈ స్థానంలో నూతన వ్యక్తి కోసం ఇప్పటి నుంచే వేట ప్రారంభించింది.
దీంతోపాటు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు నూతన మేనేజింగ్ డైరెక్టర్‌ను నియమించేయోచనలో కూడా సంస్థ ఉన్నది.