Indian Envoy | బంగ్లాదేశ్ (Bangladesh)లోని భారత దౌత్యవేత్త (Indian Envoy)కు సమన్లు జారీ అయ్యాయి. న్యూ ఢిల్లీ (New Delhi), సిలిగురి (Siliguri)లో జరిగిన సంఘటనలను నిరసిస్తూ భారత హైకమిషనర్‌ను పిలిపించి నిరసన తెలిపింది. భారత్‌లోని తమ దౌత్య కార్యాలయాలపై జరిగిన దాడులపై బంగ్లాదేశ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘దౌత్య కార్యాలయాలపై దాడులు, బెదిరింపులను బంగ్లాదేశ్ తీవ్రంగా ఖండిస్తోంది. ఇది దౌత్య సిబ్బంది భద్రతకు హాని కలిగించడమే కాకుండా పరస్పర గౌరవం, శాంతిని కూడా దెబ్బతీస్తుంది’ అని పేర్కొంది. కాగా, గతవారం బంగ్లాదేశ్ హైకమిషనర్‌కు భారత్ సమన్లు (India summon Bangla High Commissioner) జారీ చేసిన విషయం తెలిసిందే. బంగ్లాలోని భారత దౌత్య కార్యాలయానికి బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది.
Also Read..
Bangladesh High Commission | ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ వద్ద ఉద్రిక్తత.. పోలీసులు అప్రమత్తం
Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో హింస.. ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి
Muhammad Yunus | బంగ్లాదేశ్‌లో సకాలంలోనే ఎన్నికలు.. అశాంతి వేళ యూనస్ కీలక ప్రకటన