ఇస్లామాబాద్ : (Shoaib Akhtar) రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా పేరొందిన ఒకప్పటి పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్‌కు తీవ్ర అవమానం ఎదురైంది. ప్రభుత్వ యాజమాన్యంలో నడుస్తున్న పీటీవీ స్పోర్ట్స్‌లో క్రికెట్ చర్చ జరుగుతుండగా.. సెట్ నుంచి వెళ్లిపోవాలని షో హోస్ట్ చెప్పాడు. దాంతో చొక్కాకున్న మైక్‌ను తీసేసి అక్తర్ వెళ్లిపోయాడు. ఈ అవమానంతో క్రికెట్ విశ్లేషకుడిగా కొనసాగనని స్పష్టం చేశారు. పీటీవీ షో నిర్వాహకుల తీరుపై నెటిజెన్లు మండిపడుతున్నారు. పాక్ స్పీడ్‌స్టర్‌గా సేవలందించిన అక్తర్‌ను అవమానించిన షో హోస్ట్ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
టీ 20 ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్‌పై పాకిస్తాన్ విజయం సాధించిన తర్వాత పీటీవీ స్పోర్ట్స్ నిర్వహించిన షోకు డాక్టర్ నౌమాన్ నియాజ్ హోస్ట్‌గా వ్యవహరించాడు. ఈ సందర్భంగా అక్తర్, నౌమాన్ మధ్య వేడివేడి చర్చ జరిగింది. తన వాదన నచ్చనట్లయితే సెట్ నుంచి బయటకు వెళ్లిపోవచ్చునని అక్తర్‌తో నౌమాన్ చెప్పాడు. అక్తర్ సమాధానం కోసం ఎదురుచూడకుండా తన పనిలో నిమగ్నమైపోయాడు. దాంతో షోయాబ్ అక్తర్ మారు మాట్లాడకుండా మైక్ తీసి టేబుల్‌పై పెట్టి వెళ్లిపోయాడు. తనతో చెడుగా ప్రవర్తించడం, సెట్ నుంచి వెళ్లిపోవాలని చెప్పడాన్ని అవమానంగా భావించి బయటకెళ్లిపోయానని షోయాబ్ అక్తర్ ట్వీట్ చేశారు.
ఈ షోలో పాల్గొన్న సర్ వివియన్ రిచర్డ్స్, డేవిడ్ గోవర్, రషీద్ లతీఫ్, ఉమర్ గుల్, ఆకిబ్ జావేద్, పాకిస్తాన్ మహిళల జట్టు కెప్టెన్ సనా మీర్ వంటి ప్రముఖులు ఈ సంఘటనతో విచారం వ్యక్తం చేసినట్లుగా వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, షోయాబ్ అక్తర్‌కు మెజారిటీ నెటిజెన్లు మద్దతుగా నిలిచారు. దీనికి బాధ్యత వహించి డాక్టర్ నౌమాన్ నియాజ్ క్షమాపణలు చెప్పాలని నెటిజెన్లు డిమాండ్ చేస్తున్నారు.
Dr Nauman Niaz and Shoaib Akhtar had a harsh exchange of words during live PTV transmission. pic.twitter.com/nE0OhhtjIm
— Kamran Malik (@Kamran_KIMS) October 26, 2021
మడగాస్కర్ అడవుల్లో బుల్లి ఊసరవెల్లి
రామ్‌దేవ్ బాబాకు ఢిల్లీ కోర్టు సమన్లు
బ్రిటన్‌లో కొత్త ఫుడ్ ట్రెండ్ 5 : 2 .. వెజిటేరియన్ వైపు మొగ్గు
పాకిస్తాన్‌కు సౌదీ అరేబియా చేయూత.. 300 కోట్ల ఆర్థిక సాయం ప్రకటన
ఆఫ్ఘనిస్తాన్‌లోనే ఇంకా 450 మంది అమెరికన్లు.. పెంటగాన్ వెల్లడి
పంజాబ్ రాజకీయాల్లో మళ్లీ చురుగ్గా కెప్టెన్
ఈ పండు రోజూ తింటే హార్ట్ అటాక్ రాదంట..! ఆక్స్ఫర్డ్ పరిశోధకుల వెల్లడి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..