Shikhar Dhawan | భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ మళ్లీ క్రికెట్ ఆడనున్నారు. టీమిండియా తరఫున ఈ ఏడాది జరుగనున్న రెండో ఎడిషన్‌లో వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL)లో బరిలోకి దిగనున్నాడు. ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు చేశాడు. శిఖర్ ధవన్ గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇక మరోసారి క్రికెట్ గ్రౌండ్లో అభిమానులను అలరించబోతున్నాడు.
శిఖర్ ధవన్ తన కెరియర్లో 164 వన్డే మ్యాచులు ఆడాడు. 44 సగటు, 91.35 స్ట్రయిక్ రేట్‌తో 6,793 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలున్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 143. ఇక 38 టెస్టుల్లో 40.61 సగటు, 67 స్ట్రయిక్ రేట్‌తో 2,315 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు, మరో ఐదు హాఫ్ సెంచరీలున్నాయి. టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 190. ఇక 68 టీ20ల్లో మ్యాచులు డాడు. 126.36 స్ట్రయిక్ రేట్‌తో 1,759 పరుగులు చేశాడు. ఇందులో 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. త్యధిక వ్యక్తిగత స్కోరు 92. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 221 మ్యాచులు ఆడాడు. 6,769 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, మరో 51 హాఫ్ సెంచరీలున్నాయి.
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన శిఖర్ ధవన్ మళ్లీ వరల్డ్ చాంపియన్స్షిప్ ఆఫ్ లెజెండ్స్ జట్టులో భారత జట్టు తరఫున ఆడనుండడంపై జట్టు కో ఓనర్ సుమంత్ బహల్ హర్షం వ్యక్తం చేశారు. ధవన్ చేరికతో జట్టు మరింత స్ట్రాంగ్‌గా మారిందన్నారు. వరల్డ్ చాంపియన్స్షిప్ ఆఫ్ లెజెండ్స్ తొలి టైటిల్‌ను భారత్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ సారి టైటిల్‌ను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. పాత ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడంతో పాటు కొత్త ఆటగాళ్లను తీసుకోవడం ద్వారా మరింత బలోపేతం అవుతుందన్నారు. ఇక డబ్ల్యూసీఎల్ వ్యవస్థాపకుడు హర్షిత్ తోమర్ సైతం ధవన్ ఎంట్రీపై ఆనందం వ్యక్తం శారు. ధవన్ రాకతో లీగ్ ప్రాముఖ్యత పెరుగుతుందన్నారు. క్రికెట్ పునరుత్తేజమవుతుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఆకట్టుకునేలా టోర్నీని నిర్వహిస్తామని తెలిపారు. ధవన్ మాట్లాడుతూ క్రికెట్ పట్ల తనకున్న ప్రేమను కొనసాగించేందుకు ఇలాంటి టోర్నీలు ప్రేరణ ఇస్తాయని తెలిపాడు.
రెండో ఎడిషన్‌లో వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ మ్యాచులు జులైలో జరుగనున్నాయి. తొలి మ్యాచ్ ఇంగ్లాండ్ – పాకిస్థాన్ మధ్య జరుగనున్నది. జులై 20న భారత జట్టు పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్ ఆడుతుంది. మ్యాచులన్నీ యూకేలో జరుగనున్నాయి. ఇక టీమ్‌లో యువరాజ్ సింగ్, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, ఆర్పీ సింగ్, హర్భజన్ సింగ్, ధావన్ కులకర్ణి, పవన్ నేగి, వినయ్ కుమార్, రాబిన్ ఊతప్ప, నమన్ ఓజా, సౌరభ్ తివారి, సురేశ్ రైనా, అంబటి రాయుడు తదితర క్రికెటర్లు ఉన్నారు.
Read Also :
Mohammed Siraj | జనై భోస్లేతో డేటింగ్ వార్తలపై స్పందించిన హైదరాబాదీ బౌలర్ సిరాజ్..!
Jasprit Bumrah | కోల్డ్ ప్లే కన్సర్ట్‌లో బుమ్రా సందడి.. వీడియో వైరల్