Headingley Test | అండర్సన్ – తెండూల్కర్ ట్రోఫీలోని హెడింగ్లే టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఐదో రోజు తొలి సెషన్లో ఇంగ్లండ్ ఆధిపత్యం చెలాయించగా.. రెండో సెషన్లో భారత బౌలర్లు వికెట్లతో చెలరేగారు. శార్దూల్ విజృంభణతో 253కే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టు విజయం కోసం శ్రమించాల్సిన పరిస్థితిలో పడింది. టీ బ్రేక్ సమయానికి స్టోక్స్ సేన 269 పరుగులు చేసింది. ఇంకా 102 రన్స్ కొడితే విజయం ఆ జట్టు సొంతమవుతుంది. అయితే.. ఆఖరి సెషన్లో భారత పేసర్లు జో రూట్(14 నాటౌట్) .. స్టోక్స్‌ను త్వరగా పెవిలియన్ చేర్చితే సిరీస్‌లో టీమిండియా ఆధిక్యంలోకి దూసుకెళ్లడం ఖాయం.
ఓవర్ నైట్ స్కోర్ 21తో ఐదో రోజు బ్యాటింగ్ కొనసాగించిన ఇంగ్లండ్‌ను ఓపెనర్లు పటిష్ట స్థితిలో నిలిపారు. పిచ్ బౌలర్లకు ఏమాత్రం అనుకూలించకపోవడంతో భారత పేసర్లు వికెట్ కోసం శ్రమించినా ఫలితం లేకపోయింది. లంచ్ తర్వాత ఓపెనర్ జాక్ క్రాలే(65)ను ఔట్ చేసి ప్రసిధ్ కృష్ణ(2-69) తొలి బ్రేక్ ఇవ్వగా.. వరుణుడి బ్రేక్ తర్వాత శార్దూల్ ఠాకూర్(2-25) రెచ్చిపోయాడు.
A double-wicket over! 👍 👍
Shardul Thakur making merry! 👏 👏
2⃣ good catches – one each by the substitute fielder Nitish Kumar Reddy & then, by Rishabh Pant! 👌 👌
England 4 down as Ben Duckett & Harry Brook depart.
Updates ▶️ https://t.co/CuzAEnAMIW #TeamIndia |… pic.twitter.com/2WoYJK3x7q
— BCCI (@BCCI) June 24, 2025
వరుస బంతుల్లో రెండు కీలక వికెట్లతో ఇంగ్లండ్‌ను గట్టి దెబ్బ తీశాడు. సెంచరీతో క్రీజులో పాతుకుపోయిన ఓపెనర్ బెన్ డకెట్(149)ను వెనక్కి పంపిన అతడు.. ఆ తర్వాత హ్యారీ బ్రూక్(0)ను డకౌట్‌గా పెవిలియన్ చేర్చి హ్యాట్రిక్‌పై నిలిచాడు. అయితే.. బెన్ స్టోక్స్(13 నాటౌట్) వికెట్ కాపాడుకున్నాడు. ప్రస్తుతానికి ఇంగ్లండ్ గెలుపు భారం రూట్, స్టోక్స్‌లపై ఉంది.