England Tour : ముక్కోణపు సిరీస్ విజయోత్సాహంలో ఉన్న భారత మహిళల జట్టు (Team India) మరో సిరీస్‌కు సిద్ధమవుతోంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా జూన్‌లో ఇంగ్లండ్ పర్యటన (England Tour)లో వన్డే, టీ20 సిరీస్ ఆడనుంది. దాంతో, ఈ పర్యటన కోసం భారత సెలెక్టర్లు గురువారం స్క్వాడ్‌ను ప్రకటించారు. ‘లేడీ సెహ్వాగ్’గా పేరొందిన షఫాలీ వర్మ (Shefali Verma) టీ20 స్క్వాడ్‌లో చోటు దక్కించుకుంది. తద్వారా దాదాపు ఏడాది విరామం తర్వాత షఫాలీ నీలిరంగు జెర్సీ వేసుకోనుంది.
ఇంగ్లండ్ పర్యటనలో భారత్.. 5 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. సుదీర్ఘమైన ఈ సిరీస్ కోసం సెలెక్టర్లు సీనియర్లతో, ఆల్‌రౌండర్లతో కూడిన పటిష్ఠమైన స్క్వాడ్‌ను ఎంపిక చేశారు. ఈమధ్యే శ్రీలంక గడ్డపై ముగిసిన ముక్కోణపు సిరీస్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన విజయంలో కీలక పాత్ర పోషించిన స్నేహ్ రానా (Sneh Rana) రెండు ఫార్మట్లకు ఎంపికైంది.
For more details regarding #ENGvIND click 🔽https://t.co/LqjBS2oDBR#TeamIndia https://t.co/HcHC8Dr2Vt
— BCCI Women (@BCCIWomen) May 15, 2025
వన్డేల్లో మాత్రమే ఆడుతున్న యస్తికా భాటియా, ఆల్‌రౌండర్ హర్లీన్ డియోల్ టీ20 స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నారు. జూన్ 28న ట్రెంట్ బ్రిడ్జ్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టీ20 ఆడనున్నాయి. ఆ తర్వాత జూలై 22న ఇరుజట్ల మధ్య తొలి వన్డే జరుగనుంది.
వన్డే స్క్వాడ్ : హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన(వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, రీచా ఘోష్(వికెట్ కీపర్), యస్తికా భాటియా(వికెట్ కీపర్), తేజల్ హసబ్నిస్, దీప్తి శర్మ, స్నేహ్ రానా, శ్రీ చరణి, సుచీ ఉపాధ్యాయ్, అమన్‌జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గాడ్, సయాలీ సత్గరే.
టీ20 స్క్వాడ్ : హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన(వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, రీచా ఘోష్(వికెట్ కీపర్), యస్తికా భాటియా(వికెట్ కీపర్), హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, స్నేహ్ రానా, శ్రీ చరణి, సుచీ ఉపాధ్యాయ్, అమన్‌జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గాడ్, సయాలీ సత్గరే.
𝙒𝙞𝙣𝙣𝙚𝙧𝙨 𝙖𝙧𝙚 𝙜𝙧𝙞𝙣𝙣𝙚𝙧𝙨 😁#TeamIndia, the winners of #WomensTriNationSeries2025 🏆
Scorecard ▶️ https://t.co/rVyie6SUw9#INDvSL pic.twitter.com/Ti3rNQopUd
— BCCI Women (@BCCIWomen) May 11, 2025