ఆదిలాబాద్ : రాజీవ్ యువ వికాసం ( Rajiv Yuva Vikasam) దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah ) అధికారులకు సూచించారు. రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన పై ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, బ్యాంక్ మేనేజర్లు, అధికారులతో గురువారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఐటీడీఏ ఏపీవో తో ఖుష్బూ గుప్తా తో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
మండల స్థాయిలో పరిశీలించిన దరఖాస్తుల వివరాలను సంబంధిత బ్యాంకులకు తదుపరి చర్య నిమిత్తం పంపాలని తెలిపారు. అన్ని దరఖాస్తులను పూర్తిస్థాయిలో బ్యాంకర్లు, ఎంపీడీవోలతో కలిసి ఈనెల 19వ తేదీలోగా పూర్తిగా పరిశీలన జరపాలని అన్నారు. అందుకు బ్యాంకర్లకు అనువుగా ఇద్దరు ఆపరేటర్లను నియమించి ఉదయం, సాయంత్రం షిఫ్ట్ వారీగా విధులు నిర్వహించాలని వెల్లడించారు.
రాజీవ్ యువ వికాసం కింద 48,296 దరఖాస్తులు రాగా ఇప్పటి వరకు 43,417 వేలు డెస్క్ వెరిఫికేషన్ మండల స్థాయిలో పరిశీలించామని పేర్కొన్నారు. పరిశీలన ప్రక్రియ వేగవంతం చేసి సోమవారం లోగా జాబితాను అందించాలని సూచించారు.