Gautam Gambhir : ఇంగ్లండ్ పర్యటనకు కోసం భారత జట్టు ఎంపికపై సెలెక్టర్లు కసరత్తు ప్రారంభించారు. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు రిటైర్ కావడంతో.. జూనియర్లతో పటిష్ఠమైన స్క్వాడ్‌ను ఇంగ్లండ్ పంపాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) గురువారం ముంబైలోని సిద్ధి వినాయక (Siddhi Vinayaka Ganapati) ఆలయాన్ని సందర్శించాడు. ప్రత్యేక పూజుల చేసిన గౌతీ అనంతరం గణేశుడి ఆశీస్సులు తీసుకున్నాడు. ఇంగ్లండ్ పర్యటనకు జట్టు ఎంపిక గురించి కోచ్ గంభీర్ గురువారం సాయంత్రం సెలెక్టర్లతో సమావేశం అయ్యే అవకాశముంది.
నిరుడు టీ20 వరల్డ్ కప్ తర్వాత కోచ్‌గా నియమితుడైన గంభీర్.. శ్రీలంక పర్యటనలో విజయవంతంం అయ్యాడు. కానీ స్వదేశంలో న్యూజిలాండ్ జట్టు టీమిండియాను వైట్‌వాష్ చేసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా (Australia) గడ్డపై భారత జట్టు పరాజయంతో గౌతీ కోచింగ్‌పై పెదవి విరుస్తున్నారు మాజీ ఆటగాళ్లు, అభిమానులు. కాబట్టి.. జూన్‌లో ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్ అతడికి సవాల్ కానుంది. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలకడంతో గంభీర్ జూనియర్లతోనే అద్భుతాలు చేయాల్సి ఉంటుంది.
#WATCH | Head coach of Indian cricket team, Gautam Gambhir offers prayers at Shree Siddhivinayak Ganapati Temple in Mumbai.
(Video: Shree Siddhivinayak Ganapati Temple Trust) pic.twitter.com/SHEcPyOJDs
— ANI (@ANI) May 15, 2025
ఇంగ్లండ్ పర్యటనతో భారత జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(WTC) కొత్త సైకిల్‌ను మొదలు పెట్టనుంది. దాంతో, విజయంతో తొలి అడుగు వేయాలని భావిస్తున్న కోచ్ గంభీర్.. కొత్త కెప్టెన్, వైస్ కెప్టెన్ ఎంపకిపై దృష్టి సారించారు. కోహ్లీ, హిట్‌మ్యాన్ లేని లోటును పూడ్చగలిగే ఆటగాళ్లకు సెలెక్టర్లు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈమధ్య దేశవాళీలో, ఐపీఎల్లో.. పరుగుల వరద పారిస్తున్న సాయి సుదర్శన్(Sai Sudarshan), కరుణ్ నాయర్లకు స్క్వాడ్‌లో చోటు దక్కే వీలుంది.