Pahalgam attack | పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో తిరుమలలో భద్రత మరింత బలోపేతం చేయాలి : రేంజ్ డీఐజీ
Pahalgam attack | పహల్గాం ఉగ్రదాడి (Pahalgam terror attack) ఘటన నేపథ్యంలో తిరుమల ఆలయంలో భద్రతను( Security ) మరింత బలోపేతం చేయడమే భద్రతా ఆడిట్ ఉద్దేశమని డీఐజీ డాక్టర్ షెమూషి అన్నారు.
తిరుమల : తిరుమలలోని( Tirumala ) అన్నమయ్య భవన్లో గురువారం తిరుమల భద్రతపై ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పోలీసు శాఖ, టీటీడీ(TTD) , ఇతర భద్రతా విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షెమూషి ( Range DIG Shemushi ) అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది.
ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ ఇటీవల పహల్గాం ఉగ్రదాడి (Pahalgam terror attack) ఘటన నేపథ్యంలో తిరుమల ఆలయంలో భద్రతను( Security ) మరింత బలోపేతం చేయడమే భద్రతా ఆడిట్ ఉద్దేశమని పేర్కొన్నారు. అన్ని భద్రతా దళాలు , టీటీడీ విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ, భక్తుల మనోభావాలను కాపాడటమే ప్రధాన లక్ష్యంగా ఉండాలన్నారు. టీటీడీ ఇన్ఛార్జి సీవీఎస్వో , తిరుపతి అర్బన్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు 2023 మే నెలలో నిర్వహించిన భద్రతా ఆడిట్ సమీక్షలో చేసిన ప్రతిపాదనలు, ఇటీవల ఏర్పడిన పరిస్థితుల ఆధారంగా చేపట్టాల్సిన మార్పులు అనే విషయాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సుదీర్ఘoగా వివరించారు.
ఏపీఎస్పీ, డీఏఆర్, ఎస్పీఎఫ్, హోం గార్డులు, సివిల్ పోలీసు, టీటీడీ భద్రతా సిబ్బంది వంటి అన్ని భద్రతా దళాలను సమన్వయ పరచి ప్రతి ఒక్క దళానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది సహా అన్ని యాక్సెస్ కంట్రోల్ బృందాలకు తగిన శిక్షణ ఇవ్వాల్సిన అవసరముందని అన్నారు. తలకోన, మామండూరు, తుంబురు తీర్థం, మంగళం మార్గాలు సహా శేషాచల అటవీ ప్రాంతానికి చెందిన 14 ప్రవేశ ద్వారాలలో భద్రతను మరింత పటిష్టం చేయాలని సూచించారు.
భద్రతా సిబ్బందికి రసాయన, జీవ, కిరణ, అణు ముప్పులపై శిక్షణ (CBRN), యాంటీ సాబటేజ్ చర్యలు, మాక్ డ్రిల్లులు, ఎవాక్యుయేషన్ డ్రిల్లులు వంటి అంశాలపై శిక్షణలు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో గ్రేహౌండ్స్ ఎస్పీ డాక్టర్ గరుడ్ సుమిత్ సునీల్, ఐఎస్డబ్ల్యూ ఎస్పీ అరిఫ్ హఫీజ్, తిరుపతి డీఎఫ్వో వివేక్ ఆనంద్, వివిధ భద్రతా దళ అధికారులు, టీటీడీ విజిలెన్స్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

