Dumping Yard | గుమ్మడిదల, మే15: ప్యారానగర్ డంపింగ్‌యార్డుతో ఇక్కడి గ్రామాల ప్రజల బతుకులు ఆగం చేస్తారా..? అని నల్లవల్లి, ప్యారానగర్, కొత్తపల్లి గ్రామాల ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నిస్తున్నారు. గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్యారానగర్ గ్రామ సమీపంలో ఏర్పాటు కాబోతున్న డంపింగ్‌యార్డును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు.
ఈఎంఎస్డబ్ల్యూ పనులు నిలిపి వేసి ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని నల్లవల్లి, ప్యారానగర్ గ్రామాల ప్రజలు రైతు జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహారదీక్షలు గురువారానికి వందో రోజుకు చేరుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి డంపింగ్‌యార్డును ఉపసంహరించుకోవాలని రైతు జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.