భూదాన్ పోచoపల్లి, మే 15 : చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన పోచంపల్లి టూరిజం పార్క్‌ను మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే సుందరీమణులు గురువారం సందర్శించారు. టూరిజం పార్క్‌లోని మ్యూజియంలో దారం నుంచి వస్త్రాల తయారీ వరకు వివిధ ప్రక్రియలను వారు స్వయంగా పరిశీలించారు. చేనేత కళాకారులు చేనేత వస్త్రాల తయారీ గురించి వారికి వివరించారు. టూరిజం పార్క్ ఆవరణలో చేనేత స్టాల్ ను వారు పరిశీలించారు.
పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు కళాత్మకంగా ఉన్నాయని, నేతన్నల కళా నైపుణ్యాన్ని వారు ప్రశంసించారు. ఈ బృందంలో మిస్ వరల్డ్ ఈవెంట్ ఇన్చార్జి డాక్టర్ లక్ష్మి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర టూరిజం శాఖ జీఎం ఉపేందర్ రెడ్డి, బోనగిరి ఆకాంక్ష యాదవ్, అధికారులు పాల్గొన్నారు.
Bhoodan Pochampally : పోచంపల్లిలో ప్రపంచ సుందరీమణుల సందడి
Bhoodan Pochampally : పోచంపల్లిలో ప్రపంచ సుందరీమణుల సందడి
Bhoodan Pochampally : పోచంపల్లిలో ప్రపంచ సుందరీమణుల సందడి