INDW vs NPLW : మహిళల ఆసియా కప్‌లో భారత బ్యాటర్లు వీరకొట్టుడు కొడుతున్నారు. గత మ్యాచ్‌లో యూఏఈ బౌలర్లను ఉతికేసిన ఓపెనర్లు.. మంగళవారం నేపాల్ బౌలర్ల భరతం పట్టారు. దాంతో, టీమిండియా నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. దంబుల్లా స్టేడియంలో రెచ్చిపోయిన షఫాలీ వర్మ(82) మెరుపు హాఫ్ సెంచరీ చేసింది. దయలాన్ హేమలత(47) విధ్వంసం సృష్టించగా.. ఆఖర్లో జెమీమా రోడ్రిగ్స్(28 నాటౌట్) ధనాధన్ ఆడి జట్టు స్కోర్ 170 దాటించింది.
ఆసియా కప్‌లో వరుసగా రెండు విజయాలు సాధించిన టీమిండియా మూడో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ విశ్రాంతి తీసుకోగా వైస్ కెప్టెన్ స్మృతి మంధానా పగ్గాలు అందుకుంది. ఓపెనర్లు షఫాలీ వర్మ(82), దయలాన్ హేమలత(47)లు నేపాల్ బౌలర్లను చితక్కొట్టారు. దాంతో, స్కోర్ పరుగులు పెట్టింది. తొలి వికెట్‌కు 122 రన్స్ జోడించి భారీ స్కోర్‌కు బాటలు వేశారు. చివర్లో జెమీమా రోడ్రిగ్స్(28 నాటౌట్) దంచేయడంతో భారత్ భారీ స్కోర్ చేసింది.