IPL : ఐపీఎల్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్ తగలనుంది. రెండేండ్లుగా హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్న అశిష్ నెహ్రా(Ashish Nehra) రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నాడట. టీమ్ డైరెక్టర్ విక్రమ్ సోలంకీ (Vikram Solanki) సైతం ఫ్రాంచైజీని వీడాలని నిర్ణయించుకున్నాడని సమాచారం. వచ్చే ఏడాది జరుగబోయే మెగా వేలం లోపే ఈ ఇద్దరూ గుజరాత్‌కు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh)తో మేనేజ్మెంట్ చర్చలు జరుపుతోంది అంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే.. గుజరాత్ ఫ్రాంచైజీ మాత్రం ఈ పరిణామాలపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
‘ఐపీఎల్ 18వ సీజన్‌కు ముందు చాలా మార్పులు జరగనున్నాయి. నెహ్రా, సోలంకీలు జట్టును వీడేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే యవరాజ్ సింగ్‌తో మేనేజ్మెంట్ చర్చలు జరుపుతోంద. అయితే.. కొత్త కోచింగ్ సిబ్బందిని ఇంకా ఫైనల్ చేయలేదు. కానీ, కచ్చితంగా సిబ్బందిని మారుస్తాం’ అని గుజరాత్ ఫ్రాంచైజీ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
భారత మాజీ క్రికెటర్లు అయిన నెహ్రా, సోలంకిలు 2022 నుంచి గుజరాత్ జట్టుతో కొనసాగుతున్నారు. వీళ్ల దిశానిర్దేశనంలో అరంగేట్రంలోనే గుజరాత్ టైటాన్స్ చాంపియన్‌గా అవతరించింది. హార్దిక్ పాండ్యా సారథ్యంలో డిఫెండింగ్ చాంపియన్‌గా 16వ సీజన్లో రన్నరప్‌గా నిలిచింది.
అయితే.. 17వ సీజన్‌కు ముందు ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. సారథిగా విజయవంతమైన పాండ్యాను ముంబై ఇండియన్స్‌కు అమ్మేసింది. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ను కొత్త కెప్టెన్‌గా ప్రకటించింది. కానీ, గిల్ నాయకత్వంలో గుజరాత్ మునపటి జోరు కనబరచలేకపోయింది. స్టార్ ఆటగాళ్లు డేవిడ్ మిల్లర్, వికెట్ కీపర్ వృద్దమాన్ సాహా, విజయ్ శంకర్ వైఫల్యంతో ప్లే ఆఫ్స్ చేరలేకపోయింది. అంతేకాదు సీనియర్ పేసర్ మహ్మద్ షమీ లేని లోటు కూడా జట్టు విజయావకాశాల్ని దెబ్బతీసింది.