Ban On Sixers : ఈ టీ20 యుగంలో క్రికెట్ మ్యాచ్ అంటేనే ఫోర్లు, సిక్సర్లు. అందుకనే హిట్టర్లు పోటీపడి మరీ బంతిని స్టాండ్స్‌లోకి పంపుతుంటారు. ఎక్కడైనా సిక్సర్ కొడితే ఆరు పరుగులు ఇస్తారు. కానీ, అక్కడ మాత్రం ఔట్. అవును అక్క సిక్సర్లు కొట్టడం నిషేధం. పొరపాటున ఎవరైనా బంతిని బౌండరీ లైన్ అవతల పడేశారనుకోండి ఔట్‌గా ప్రకటిస్తారు. అంతేకాదు చట్టపరంగా కేసులు కూడా ఎదుర్కోవాల్సిందే. చదవడానికి, వినడానికి విడ్డూరంగా అనిపించే ఈ నియమం ఎక్కడ ఉందో తెలుసా..? క్రికెట్‌కు పుట్టినిల్లు అయిన ఇంగ్లండ్(England)లో.
ఇదేంటీ?.. ఇంగ్లండ్‌లో క్రికెటర్లు సిక్సర్లు బాదడంపై నిషేధం ఉందా? అని షాక్ అవతున్నారా? అయితే ఇది చదివేయడంది. ఇంగ్లండ్‌లోని వెస్ట్ సస్సెక్స్(West Sussex)లో సౌత్ విక్, సొరెహమ్(South wick And Soreham) అనే క్రికెట్ క్లబ్ ఉంది.
SCC’s 2019 Season Round-Up Newsletter – https://t.co/yd5zI72uLb #shoreham #southwick @DukeShoreham pic.twitter.com/g5dtsIklDf
— Southwick & Shoreham Cricket Club (@SouthwickCC1790) September 22, 2019
ఆ క్లబ్ చుట్టూరా ఇండ్లు, పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయి. ఆ క్లబ్లో క్రికెట్ మ్యాచ్‌ల సమయంలో ఆటగాళ్లు భారీ సిక్సర్లు బాదిన ప్రతిసారి సమీపంలోని ఎవరో ఒకరి ఇంటి పైభాగం, టెర్రస్, బాల్కనీలోని వస్తువులు, ఇతర సామాగ్రి ధ్వంసం అయ్యేవి. అప్పుడప్పుడు స్థానికులకు కూడా బంతి తగిలి చిన్న చిన్న గాయాలు అయ్యేవి.

దాంతో, అక్కడి జనమంతా కలిసి ఓ నిర్ణయానికి వచ్చారు. ఇకపై సౌత్ విక్, సొరెహమ్ క్లబ్లో ఎవరైనా సిక్సర్లు కొడితే లీగల్ కేసు పెడతామని యాజమాన్యాన్ని హెచ్చరించారు. దాంతో, అప్పటినుంచి ఎందుకొచ్చిన తలనొప్పిరా బాబూ అని క్లబ్ మేనేజ్మెంట్ సిక్సర్లపై నిషేధం విధించింది. అంతేకాదండోయ్.. పొరపాటున సిక్సర్ బాదిన వాళ్లను ఔట్‌గా ప్రకటిస్తున్నారు. అయితే.. ‘బౌలర్‌ను దీటుగా ఎదుర్కొంటూ సిక్సర్ కొడితే వచ్చే కిక్ మిస్ అవుతోంది’ అంటూ అక్కడి యువ క్రికెటర్లు నిట్టూరుస్తున్నారు. మరోవైపు స్థానికులు ఎదైతేనేమీ మా ఆస్తులు, ప్రాణాలకు ఏ ప్రమాదం జరగట్లేదు అని నింపాదిగా ఉంటున్నారు. ఇదండీ విషయం..