Union Budget 2024 | మధ్యతరగతికి ఊతమిచ్చిన కేంద్ర బడ్జెట్ : అమితాబ్ కాంత్
Union Budget 2024 : నిర్మలమ్మ బడ్జెట్‌ను పురోగామి బడ్జెట్‌గా నీతిఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ అభివర్ణించారు. కేంద్ర బడ్జెట్ ప్రగతిదాయకంగా, దీర్ఘకాలిక దృష్టితో రూపొందిందని ప్రశంసించారు.
Union Budget 2024 : నిర్మలమ్మ బడ్జెట్‌ను పురోగామి బడ్జెట్‌గా నీతిఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ అభివర్ణించారు. కేంద్ర బడ్జెట్ ప్రగతిదాయకంగా, దీర్ఘకాలిక దృష్టితో రూపొందిందని ప్రశంసించారు. రాబోయే మూడు దశాబ్ధాలకు ఈ బడ్జెట్ రోడ్‌మ్యాప్ అందించిందని అన్నారు. కీలకమైన ఉపాధి కల్పనపై బడ్జెట్ ప్రత్యేకంగా దృష్టిసారించడం అభినందనీయమని వ్యాఖ్యానించారు.
టూరిజం, ఎంఎస్ఎంఈ, స్టార్టప్‌లు, స్పేస్ వంటి భిన్న రంగాల ద్వారా ఉద్యోగాలను అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి సారించారని చెప్పారు. నగరీకరణ, నూతన పారిశ్రామిక కారిడార్లు, గ్రోత్ సెంటర్లు వృద్ధికి కీలకంగా మారతాయని తెలిపారు. ఇక మధ్యతరగతికి రూ. 17,500 వరకూ పన్ను ఆదా అవడం స్వాగతించదగిన పరిణామమని పేర్కొన్నారు. బడ్జెట్‌ను కేవలం పన్ను లాభాల కోణంలోనే చూడరాదని చెప్పారు.
ఆర్ధిక వ్యవస్ధ వృద్ధికి ఎలా ఊతమిస్తుందనే కోణంలో బడ్జెట్‌ను అంచనా వేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. భారత్ వృద్ధి చెందితే మధ్యతరగతి వృద్ధి చెందుతుందని, దేశం ఎదిగితే మధ్యతరగతి కూడా ఎదుగుతుందని పేర్కొన్నారు. అందుకే ఈ బడ్జెట్ దేశ వృద్ధికి ఊతమిస్తూ మధ్యతరగతికి ప్రయోజనం అందించే ప్రయత్నం జరిగిందని వివరించారు.
ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (Union Budget 2025) సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్ సభలో ప్రవేశ పెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్మలమ్మ తాత్కాలిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఇక కేంద్రంలో మరోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇవాళ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
Read More :
FM Nirmala Sitharaman: తగ్గనున్న బంగారం, వెండి, మొబైల్ ఫోన్ల ధరలు..
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

