TTD EO | నాణ్యమైన నెయ్యి కొనుగోలుకు నలుగురితో కమిటీ ఏర్పాటు : టీటీడీ ఈవో
TTD EO | తిరుమల (Tirumala) శ్రీవారి లడ్డూ ప్రసాదాలు (Laddu Prasad) మరింత నాణ్యంగా, రుచికరంగా అందించాలనే లక్ష్యంతో, ఇప్పటికే తీసుకున్న చర్యల వల్ల లడ్డూ ప్రసాదాల రుచి, నాణ్యత పెరిగిందని టీటీడీ ఈవో జె. శ్యామలరావు (TTD EO) చెప్పారు.
తిరుమల : తిరుమల (Tirumala) శ్రీవారి లడ్డూ ప్రసాదాలు (Laddu Prasad) మరింత నాణ్యంగా, రుచికరంగా అందించాలనే లక్ష్యంతో, ఇప్పటికే తీసుకున్న చర్యల వల్ల లడ్డూ ప్రసాదాల రుచి, నాణ్యత పెరిగిందని టీటీడీ ఈవో జె. శ్యామలరావు (TTD EO) చెప్పారు. తిరుమల గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు.
లడ్డూ నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టామని, నాణ్యమైన నెయ్యి ద్వారా లడ్డూ నాణ్యత పెరుగుతుందని నిపుణులు తెలిపారన్నారు. ప్రస్తుతానికి అడల్ట్రేషన్ టెస్ట్ చేసే పరికరం టీటీడీ(TTD) వద్ద లేదని, త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నాణ్యమైన నెయ్యి కొనుగోలుకు సంబంధించి నలుగురు ప్రముఖ డైరీ నిపుణులతో కమిటీ (Dairy Experts) ఏర్పాటు చేశామన్నారు. ఇందులో ఎన్డీఆర్ఏ విశ్రాంత ఆచార్యులు డా.సురేంద్రనాథ్, హైదరాబాద్ కు చెందిన డాక్టర్ విజయ భాస్కర్ రెడ్డి, ప్రొఫెసర్ స్వర్ణ లత, బెంగుళూరుకు చెందిన డాక్టర్ మహదేవన్ ఉన్నారన్నారు. ఈ కమిటీ వారంరోజులలో నివేదిక అందిస్తుందని తెలిపారు.
క్వాలిటీ నెయ్యి కోసం టెండర్ లో ఎలాంటి అంశాలు చేర్చాలని ఈ కమిటీ దిశ నిర్ధేశం చేస్తుందన్నారు. నెయ్యి(Ghee) కి సువాసన చాలా అవసరమని, వీటి ద్వారా రేటింగ్ వేయడానికి నివేదిక ఇవ్వాలని కమిటీని కోరినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుత సప్లయర్స్ ను పిలిచి క్వాలిటీ నెయ్యి సరపరా చేయాలని సూచించాం. కొన్ని సంస్థలు హై క్వాలిటీ నెయ్యి పంపిస్తున్నారు, మరికొన్ని సంస్థలు నాసిరకం నెయ్యి అందిస్తున్నాయి. ఓ సంస్థ అడల్ట్రేట్ నెయ్యి ఇస్తున్నట్లు, వెటిటబుల్ ఫ్యాట్ కలుపుతున్నట్లు ఎన్ఏబిఎల్ టెస్ట్ లో తేలిందన్నారు.
టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్న ఐదుగురు సరఫరాదారులలో ఒకరు నెయ్యి నాణ్యత ప్రమాణాలు సరిపోలడం లేదని మరియు కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్నట్లు పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు చెప్పారు. టెండర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఒక కంపెనీని బ్లాక్ లిస్ట్(Block list) లో పెట్టామని వెల్లడించారు. మరో కంపెనీపై చర్యలు తీసుకుంటామన్నారు. రెండు కంపెనీలకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసినట్లు ఆయన వివరించారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

