Union Budget 2024 | బడ్జెట్ నిరుత్సాహపరిచింది : వైఎస్ షర్మిల
Union Budget 2024 : ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో మంగళవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ బాగా నిరుత్సాహపరిచిందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసంతృప్తి వ్యక్తం చేశారు.
Union Budget 2024 : ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో మంగళవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ బాగా నిరుత్సాహపరిచిందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్లో అసలు ఏమీ లేదు..గణాంకాలపై స్పష్టత లేదు, బడ్జెట్ కేవలం మ్యానిఫెస్టోలా ఉందని పెదవివిరిచారు. బడ్జెట్లో అంకెలు ఉండాల్సి ఉన్నా కేవలం ప్రకటనలు, హామీలే ఉన్నాయని వ్యాఖ్యానించారు.
ఏపీ ప్రజలకు సైతం ఈ బడ్జెట్‌తో ఒరిగిందేమీ లేదని దుయ్యబట్టారు. ఎన్నో విషయాలపై అస్పష్టత ఉందని, ఏపీ ప్రజలను ఈ బడ్జెట్ బాగా నిరాశపరిచిందని షర్మిల పేర్కొన్నారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (Union Budget 2025) సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్ సభలో ప్రవేశ పెట్టారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్మలమ్మ తాత్కాలిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఇక కేంద్రంలో మరోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇవాళ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
Read More :
Union Budget | క్యాన్సర్ రోగులకు ఊరట.. మందులపై సుంకం ఎత్తివేత
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay | తమిళ సినీ పరిశ్రమకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్.. రోజుకు ఆరు షోలకు అనుమతి,కాని దానికి మాత్రం నో!
Kiran Abbavaram | బాల్యపు జ్ఞాపకాలను గుర్తుచేసే ‘సమ్మర్ హాలిడేస్’.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి పిలుపు ప్రత్యేకం.. ఒక్కో ఆహ్వాన పత్రిక ఖర్చు రూ.20 వేల వరకు!
Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్!
EAPCET Office | గెస్ట్‌హౌస్‌గా ఎప్‌సెట్ ఆఫీస్.. అడ్మిషన్ల వేళ జేఎన్టీయూ సంచలన నిర్ణయం!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

