హోలీ వేడుకల్లో అపశుృతి..
హోలీ వేడుకల్లో అపశుృతి చోటుచేసుకుంది.ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఉత్సాహంగా రంగులు చల్లుకుంటూ గడిపిన మిత్రుల్లో విషాదం చోటుచేసుకుంది.రంగుల్లో తడిసి ముైద్దెన అనంతరం చెరువులో స్నానానికి దిగిన ఇద్దరు(బాలురు) విద్యార్థులు ఈత రాకపోవడంతో నీటిమునిగి దుర్మరణం పాలయ్యారు.
- చెరువులో స్నానానికి వెళ్లి ఇద్దరు విద్యార్థుల మృతి..
దుండిగల్,మార్చి3: హోలీ వేడుకల్లో అపశుృతి చోటుచేసుకుంది.ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఉత్సాహంగా రంగులు చల్లుకుంటూ గడిపిన మిత్రుల్లో విషాదం చోటుచేసుకుంది.రంగుల్లో తడిసి ముైద్దెన అనంతరం చెరువులో స్నానానికి దిగిన ఇద్దరు(బాలురు) విద్యార్థులు ఈత రాకపోవడంతో నీటిమునిగి దుర్మరణం పాలయ్యారు.ఈ ఘటన సూరారం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ సుధీర్‌కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం…గాజులరామారం శ్రీకృష్ణానగర్‌కు చెందిన అభిషేక్(17), విశ్వకర్మకాలనీకి చెందిన సాగర్‌కుమార్(17) ఎం.అజయ్,మేకల ఛత్రపతి, సీహెచ్.విఘ్నేష్‌లు బహదూర్‌పల్లిలోని ప్రభుత్వజూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు.
మంగళవారం హోలీ వేడుకలను మిత్రులందరు సంతోషంగా జరుపుకున్నారు. మద్యాహ్నం వేళ మిత్రులందరూ స్నానం చేసేందుకని విశ్వకర్మకాలనీలోని పంతులు చెరువులోకి దిగి ఈత కొట్టారు. అయితే అభిషేక్,సాగర్కుమార్లకు ఈత రాకపోవడంతో చెరువులోని నీట మునిగిపోయారు.తోటి స్నేహితుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయంతో చెరువులో మునిగిన అభిషేక్,సాగర్‌కుమార్ మృతదేహాలను వెలికితీశారు. దీంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. అనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం గాంధీవైద్యశాలకు తరలించారు. మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా బీహార్‌కు చెందిన సాగర్ కుటుంబం విశ్వకర్మకాలనీలో స్థిరపడగా,మెదక్ జిల్లా కౌడిపల్లికి చెందిన అభిషేక్ కుటుంబం శ్రీకృష్ణానగర్‌లోని ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్నది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Holi
- pond
- students die
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

